పుట:Jeevasastra Samgrahamu.pdf/244

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

మునను, స్థూలబీజాశయములు పీఠ సమీపమునను పుట్టును. ఈ ప్రదేశముల రెంటియందును, ఒకానొకచోట మధ్యకణములు మిగుల చురుకుగా పెరిగి బహిశ్చర్మమును కొంచెము వెలుపలి కొకదిమ్మగా నుబికించును (27-వ పటములో C-లో సూ. బీ, స్థూ. బీ. చూడుము). కాని యీ దిమ్మలు స్ఫోటనవిధానములో జెప్పబడిన మొటిమలవంటివి కావు. ఏలయన, స్ఫోటనమునందలి మొటిమయందు అంతశ్చర్మ బహిశ్చర్మ కణములు రెండునుగూడ జేరియుండును. ఈ దిమ్మయందు అంతశ్చర్మ కణము లెంతమాత్రము జేరియుండవు. ఈదిమ్మ స్థూలబీజాశయముగా పరిణమించ నేర్పడినయెడల నక్కడి మధ్యకణములలో నేదో యొకటి వికారిణీత్వమునొంది (Becomes amoeboid), సమీపముననున్న మధ్యకణముల నన్నిటిని తన పాదములచే ముట్టడివేసి తినుచు పెరుగును. ఇది యిట్లు తిని కొంతయాహారపదార్థమును నిలువజేసికొనును. ఆకుపచ్చ హైడ్రా యైనయెడల హరితకములును దీనియం దేర్పడును. తుద కీ కణమే స్థూలబీజమై పెరుగుట మాని గుండ్రనైన దగును.

స్థూలబీజమునందు గలుగుమార్పులు.

పిమ్మట నీస్థూలబీజమునందలి జీవస్థానము రెండు సమభాగములుగా చీలి యం దొకముక్క స్థూలబీజమునుండి వెలువరింపబడును. రెండవది కణములోనేయుండి తిరిగి రెండుసమభాగములుగాచీలి యీచీలికలలో నొకటికూడ కణమునుండి వెలువరింపబడును. ఇందు మొదట వెలువరింపబడిన ముక్కకు ప్రథమ