పుట:Jeevasastra Samgrahamu.pdf/142

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

నిర్మాణము.

A. యందలి కాడ కెడమప్రక్కను ఆవర్తకారి ముడుచుకొనియున్న రూపము చూపబడినది. ఇందు మూతబిళ్లయు మృదురోమములును మూసికొనబడినవి.

B. ఇందు గిన్నెమాత్రము చూపబడినది. ఆ. అ-ఆహార అవకాశములు. ఇట్టివి పెక్కులు దవ్వలో గిరగిర తిరుగుచుండును. జీ-జీవస్థానములు. అందొకటి పెద్దది-బద్దవలె నుండునది. రెండవది చిన్నది-గుండ్రముగ నుండునది. పైపొర-ఇది గిన్నెను, కాడను ఏకముగా నావరించియుండుట చూడనగును.

D1, D2, D3. సంతానవృద్ధియందలి అవస్థలు. D1, పైభాగమున బీట పుట్టినది. D2. రెండు పిల్ల ఆవర్తకారులును ఒక కాడనే అంటియున్నవి. D3. రెండువైపుల మృదురోమము గల పీపారూపము. అది బాణపు గురుతు చూపువైపునకు ఈదుకొని పోవుచున్నది.

E1. E2. సంయోగవిధానము: E1. ద్విఖండనమువలన గలిగిన పిల్లఆవర్తకారులలో నొకటి ఎనిమిది ఆవర్తకారులుగా చీలియున్నది. E2. చిన్న ఆవర్తకారి యొకటి మరియొక పెద్ద ఆవర్తకారిని జేరి, దాని గిన్నెయొక్క క్రిందిభాగమున అంటియుండి క్రమముగా పెద్దదానిలో నిముడ్చుకొనబడుచున్నది.

F1, F2, F3, F4, F5. బీజోత్పత్తియందలి వివిధావస్థలు. F1. నిశ్చలనము నొందినరూపము. జీ-జీవస్థానము అనేకముక్కలుగా చీలియున్నది. F2. బీజముయొక్క ప్రథమరూపము. F3. ఒకవైపున మృదురోమము లేర్పడియున్నవి. F4. మృదురోమములుగలవైపుక్రిందికి తిరిగి యితర పదార్థముల నంటుకొనబోవుచున్నది. F5. ఆవర్తకారి యొక రాతిని స్థిరముగ నంటుకొనియున్నది. మొదటికొనను మృదురోమము లూడిపోయినవి. పైకొనను మూతబిళ్లయు మృదురోమములును పుట్టినవి.