పుట:Jarmanii-Deisha-Vidyaavidhaanamu.pdf/28

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

వారికి విద్ద్యాభివృద్ది చేసినాడు. ఫ్రోబెల్ అనంతరము అతనిని పద్దతి ననుసరించిన వారు, అతని అభి ప్రాయమును కనుక్కోలేక, అతడే బహుమానాలను ఏర్పరిచినాడో వాటినే గ్రుడ్డిగా అవలంబించినారు. అందు చేత పిల్లలకు వాటిలో ఉత్సాహము పుట్టక పోయినది. ఆటల మూలముగా విద్య నేర్పవలెనన్నీ, పై నిర్బంధమేమీ విద్యావిషయములో పిల్లలకుండ కూడదనిన్నీ, మాత్రమే ఫ్రోబెలు అభిప్రాయము. మొన్నటి యుద్ధమునకు పూర్వమే ఈ బహుమానము మీద పిల్లలకు ఆసక్తి పోయినది. అది చూచి, డాక్టరు మాంటిసారీ అనే ఆమె మరిఒక పద్ధతి మీద పిల్లలకు కొన్ని ఆటలను కల్పించినది. ఫ్రోబెలు పద్ధతి మంచిదా, మాటిసారీ పద్ధతి మంచిదా, అనే విషయములో ఇంకా వివాదము జరుగుతూనే ఉన్నది. పిల్లలకు అవకాశము (Space) ధ్వని, రంగులు, పొడవులు అనే విషయములను గూర్చిన గ్నానము నివ్వడానికి అనేకమైన పనిముట్లను కల్పించినది. ఆ తరువాత కొక్కెములు, గుండీలు మొదలయిన సాధారణ

21