పుట:Jarmanii-Deisha-Vidyaavidhaanamu.pdf/190

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఈబడులలో పరీక్షలు చేసి, కావలసినవారికి సర్టిఫి కేట్లు ఇస్తారు. ఉన్నత పాఠశాలాపరీక్షకు పోదలచిన వారికి ప్రయివేటు గా చదువు చెప్పుతారు. వీరికి ప్రత్యేకముగా " తెలివి తేటల పరీక్ష" అనే దానిని విద్యామంత్రి శాఖ వారేర్పాటు చేసినారు . ఈపరీక్ష ఆబిట్యూరియేటెన్ పరీక్షకు సమానము. ఈప్రయివేటు విద్యార్థులకు ప్రతిశనివారమున్ను పరీక్ష జరుగుతుంది.

అధ్యాయము 22

విద్యా పరిశోధనాలయములు,

విద్యా పద్ధతులలో ఏదో ఒకటే శ్రేష్ఠమైన దని చెప్పవీలు లేదు. ప్రభుత్వము వారు, విశ్వ విద్యాలయములవారు, ఇతర విద్యాలయముల వారు కూడా కొత్త విద్యా పద్ధతులను కొత్తరీతిగా బడులను నడిపించడము కనుగొనడానికి -ప్రతి దేశము లోను ప్రోత్సాహము కల్పిస్తారు. ఆమెరికాలో ఇట్టి విద్యా పరిశోధనాలయములు చాలా ఉన్నవి.


183