పుట:Jarmanii-Deisha-Vidyaavidhaanamu.pdf/113

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

తమ కిష్టము వచ్చినపని చేసుకోవచ్చును. వారి స్వాతంత్యమునకు ఎట్టి నిర్బంధమున్ను కలుగజేయరు. విద్యార్థులకు అద్దెలకు గదులివ్వడాని కిష్టపడే కుటుంబముల వారి పట్టీని తయారు చేయడా నికి పీడల్ (Pedal) అనే ఒక ఉద్యోగి ఉంటాడు. పర దేశ ద్యార్ధులకు ఇదిమంచి సదుపాయము. ఈ సదుపాయము లండనులో గానీ, ఇంగ్లాండులోని వ సతి విద్యాలయాలలో కాని, ఇతర విశ్వవిద్యాలయా లలోగాని లేదు. విద్యార్థులు సరియైన వసతిని సంసాదించుకొనడానికి అక్కడ చాలా ఇబ్బందిపడ తారురు. నిద్రపోవడానికిన్ని , చదువుకొనడానికీన్ని ఒక్కటే గదినిగాని, 'వేరుగదులను గాని విద్యార్థులు అద్దెకు తీసుకొనవచ్చును. జర్మను విద్యార్థులు మధ్యా హ్న భోజనమును ఏదయినా హెూటలులో చే స్తారు. రాత్రి భోజనముకోసము ఇంటినుంచి తెప్పించుకొంటారు. జర్మను భాష రాని పర దేశ విద్యార్థులు భోజనసదుపాయములు గల గదులను ఏర్పాటు చేసుకోవడమే మంచిది. ఇప్పుడు విద్యార్థుల సహకారభోజనశాలను ఏర్పాటు చే

'


106