పుట:Jagattu-Jiivamu.pdf/35

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

22

జగత్తు - జీవము

27, 28 పరమాణుక్రమాంకాలుగల నికెలు (nickel) కోబాల్టు (cobalt) లలోగూడ ఈ లక్షణం కొలదిగానుంది. ఇతర పరమాణువులలో సుమారు లేదని చెప్పవచ్చును. కాబట్టి, 26, 27, 28, పరమాణుక్రమాంకాలుగల మూలపదార్థాలే అయస్కాంతత్వమును పొందినట్లుంది. 83 మొదలు 92 వరకు పరమాణుక్రమాంకాలుగల పదార్థాలే రేడియో ధార్మికత (Radio-activity) ను కలిగినట్లుంది.

కొన్ని సూత్రాల ననుసరించి విశ్వం వర్తిల్లుతూంది. ఈ సూత్రాలప్రకారంగా నిశ్చిత పరమాణుక్రమాంకం గల మూల పదార్థాలు నిశ్చితమగు ప్రత్యేకగుణాలను ప్రదర్శిస్తున్నాయి. 6, 26 నుండి 28, 83 నుండి 92 కక్షీయ ఎలక్ట్రానులుగల పరమాణువులు క్రమంగా జీవము, అయస్కాంతత్వము, రేడియోధార్మికత అను ప్రత్యేక లక్షణాలను కనుపరుస్తున్నాయి.

అనంత శక్తియుక్తుడగు సృష్టికర్త ఒకేజాతి నియమాలకు బద్దుడయేడనుకొనడానికి అవకాశంలేదు. అగణ్యములైన ఇంకే జాతి నియమాల ననువర్తించునట్లైన ఈ జగత్తును నిర్మించి ఉండవచ్చును. ఇంకొకసూత్రజాలాన్ని ఎన్నుకొన్నప్పుడు కొన్ని కొన్ని పరమాణువులకు కొన్నికొన్ని అసాధారణగుణా లలవడియుండును. ఆ పరిస్థితులలో జీవంగాని, అయస్కాంతత్వంగాని, రేడియోధార్మికతగాని ఏ పరమాణువులో కాన్పింపకపోవచ్చును. కావున, అయస్కాంతత్వము రేడియోధార్మికతవలె జీవంగూడ విశ్వాన్ని శాసించు సూత్రాలఫలితమై ఉండవచ్చునని రసాయనశాస్త్రం సూచిస్తూంది.

అహంకారపూరితుడైన మానవుడు జీవోత్పత్తి కనుకూలించుటచేతనే ఈ సూత్రాలను సృష్టికర్త ఎంచుకొన్నాడని ప్రతిపా