ఈ పుట ఆమోదించబడ్డది
26
జడకుచ్చులు
17
సుఖనిశీధము, గీతికాముఖరపథము,
సరసపవనము, సుమదళ చకితవనము ,
పెనఁగి నిలువంగనీయవు మనసులోని
ప్రియగతులఁ గంఠ ముఖమునఁ బెకలకుండ !
18
చచ్చిపోవు కారాకుల స్థానములను
చిగురుచేవలు మొలుచు సౌష్ఠవముగనుచు,
మృత్యువునకేలో భీతివహింత్రు, జనులు
అవల స్వచ్ఛందసౌందర్య మబ్బుచుండ.
<poem>