ఈ పుట ఆమోదించబడ్డది
15
నర్సింహారెడ్డి
చిన్ని పదముల తోటి
వేల ఎదలను మీటు
రామలమ్మయె మేటి
ఓ రాములమ్మ!
తనది కాని విషయము
వేలు పెట్టును నిజము
ఇది యూఎస్ నైజము
ఓ రాములమ్మ!
నాకు శత్రువు నీకు
మిత్రుడని అనబోకు
అది యాంటి కాట్సాకు
ఓ రాములమ్మ!
ఎన్నికల హామీలు
అనెడు తీయని పాలు
తుదకవు నేల పాలు
ఓ రాములమ్మ!