పుట:Indrani-Saptasathi-in-Telugu-By-Vasishtha-T-Ganapati-Muni.pdf/55

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

స్త. 2.

ఇంద్రాణీ సప్తశతీ

41



19. ఓ యంబా ! నికృష్టమైన వస్తువుకూడ స్వర్గమందు రమ్యమై యున్నప్పు డింక స్వర్గాధీశ్వరివైన నీ కాంతినిగుఱించి చెప్పుట కేమున్నది.


20. తల్లీ ! స్వర్గమందు నీవంటి రమణీయస్త్రీవి నీవే. ఈ మట్టిలోక మందింక నీకు సమానస్త్రీ నెవడు చెప్పగలడు ?


21. మిక్కిలి నీలమైన ఆకాశము స్వర్గమని కొందఱు భావించు చున్నారు. (నిర్మలాకాశము.) మఱియొక కవి సూర్యుడే స్వర్గమనుచున్నాడు.


22. ఊర్ధ్వమందున్నది, దుఃఖరహితమైనది, గొప్ప తేజస్సుగలది యగు స్వర్గము నధిష్టించిన ఇంద్రాణికి నేను నమస్కరించు చున్నాను.

(స్వర్గమునకు సరియగు నిర్వచన మీయబడెను. దీనినిబట్టి పైశ్లోకములో పేర్కొనబడిన నిర్వచనములు ఖండింపబడినవగును.)


23. ఓ యింద్రాణీ ! పచ్చిగానున్నను, పక్వమైనను నాయొక్క ఉగ్రపాపము లేవిగలవో, అధికముగానున్న ఆ పాపములను నీవు నివారింపుము.


24. ఉదార స్వభావురాలైన జయంతుని తల్లి (ఇంద్రాణి) భరత ఖండ విషాదహరణమునకై నా కత్యంత బలము నొసగుగాక.


25. అతి సుందరమైన యీ కుమార లలితా వృత్తములవలన ఇంద్రాణి సంతోష మొందుగాక.


____________