పుట:Hemalatha by Sri Chilakamarthi Lakshmi Narasimham.pdf/90

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

హేమలత

89

చిదా — “నాకును జిరకాలమునుండి మదనసింగును గడతేర్చవలెనని యున్నది. అఁత డసహాయ శూరుడు. వాని సంగతి మన యీకుఱ్ఱవాడు చక్కగానెఱుగును” అని మదనసింగును జూపెను. వెంటనే మదనసింగట్లు వారితో జెప్పసాగెను.

“అయ్యా! మదనసింగునకును నాకును నేనే యత డన్నంతయైక్యము గలదు. కాని యాతడు రాజుల పక్షమువాడు; నేను చక్రవర్తి పక్షమువాడను. అయినను బ్రభుభక్తిచేత మేమాతని గడతేర్చుట కీవఱకే కుట్రనొకటి పన్నియున్నాము. అతనిం దోడ్కొనివచ్చుటకు నొక్కమనుష్యునంపితిని. ఈ పాటికి వారు వచ్చియే యుందురు. కనుక మన మా సంకేతస్థలమునకు శీఘ్రముగఁ బోవుదము” అనెను. అంతట స్వాముల వారానందపరవశులై “నేనే యాకార్యమును జేసెదను. ఈ చేతులతో రాజపుత్రకుని ప్రాణములదీసి చక్రవర్తివద్ద పారితోషికమును గైకొనవలెను. అని యుత్సాహ వాక్యములు బలుకఁ జొచ్చెను. తరువాత వారు ప్రథమమున వసంతభట్టు లక్ష్మణసింగుతో రహస్యాలోచనలు సలిపిన యా గోడలమధ్య నున్న కుటీరమువద్దకు స్వాములవారిని గొనిపోయి యదియే మదనసింగు వచ్చెడి గృహమనిచెప్పి ముందాతూములోనుండి వారు లోనికరిగి పిమ్మట నితనింగూడ దీసికొనిపోయిరి. ఆ గృహమున కరిగి స్వాములవారు చీకటిలో గూర్చుండి తనకక్షపాల యందున్న యుత్తరముల వెదకికొనుచు “అయ్యా! మన నిమిత్తము వారు తోటలో గాచుకొని యుందురేమో! మనమరుగవద్దా” యని యడిగిరి.

“మనము మదనసింగును జంపుట యావశ్యకము గాని తోటకరుగుట