పుట:Hemalatha by Sri Chilakamarthi Lakshmi Narasimham.pdf/81

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

80

హేమలత

స్థలమునకంపి మరల రహస్యగృహమును బ్రవేశించెను. పొంచుఁయున్న చిదానందయోగియు మదనసింగును వారి సంభాషణలనాలించి తామును వారి ననుసరించి పోవుటకు నిశ్చయించిరి. ఆసమయమున యోగి రాజపుత్రుని విలొకించి కుమారా! ఈ బ్రాహ్మణుడు మనకు బరమశత్రువు. వారనుకున్న కుఱ్ఱవాఁడు మనకు బరమాప్తుడు. మన ప్రాణముల విడిచియైన బాలుని రక్షించి యీబ్రాహ్మణుని నెట్లయిన మట్టు పెట్టవలెను. నేను జయకాశీ, యనునప్పుడీబ్రాహ్మణుని నీఖడ్గముతో సంహరింపుము. దీని రహస్యము దెల్లవారకముందే నీ వెఱుఁగఁ గలవు” అని చెప్పి రసపుత్రునకు బ్రోత్సాహ మొసఁగెను. బ్రాహ్మణుడు లోనికరిగి యాబాలుని వెంటబెట్టుకొని వచ్చి తూముదాటి యూరుబైట నున్న మామిడి తోఁపువైపునకు బ్రయాణమయ్యెను. తమ జాడ వారు లక్షింపకుండ యోగియు సింగును వారనుసరించుచుండిరి. ఇట్లు కొంతదూరము చనిన పిదప గమ్యస్థానమగు మామిడితోఁపు కట్టెదుటగన్పించెను. అంధకారదేవతకు నిలయమైన యాతోట ముందుగా బ్రాహ్మణుఁడును బాలుడును బ్రవేశించిరి. మన యోగియు శిష్యుడును వారి వెనుకనే చనుచుండిరి. ఆతోఁటనడుమ నొకచోట బాలునిఁ గూర్చుండ నియమించి బ్రాహ్మణుడు ముందుకు వచ్చి రహస్యముగ దనసేవకులను జూచి యోరిశంకరా? ఓరియానందా? తుపాకులు కత్తులు సిద్ధముగా నున్నవా తుపాకులలో మందుకూరి మీ మీప్రయత్నముల నుండుఁడు. అని హెచ్చరించెను. అనవుఁడు బద్ధాంజులులై సేవకులు మహాప్రభూ! సర్వము సిద్ధమైనవి. ఢిల్లీనుండి పాండురంగనాధుఁడు సన్యాసివేషముతో గొన్ని యుత్తరములను మీకు దెచ్చి బౌద్ధమఠమునందు బసచేసియున్నాఁడు. అని విన్నవించిరి. ఆపలుకులు యోగినవిని సంతోషించెను. బ్రాహ్మణుఁడా