పుట:Hemalatha by Sri Chilakamarthi Lakshmi Narasimham.pdf/29

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

28

హేమలత

వచ్చినట్లున్నది. నా దీనమైన చరిత్ర నీకుఁ దెలియఁజేయుమనియు నీవలన నా కుపకారము కలుగననియు నాయంతరాత్మ నన్ను బ్రేరేపించుచున్నది. అందఱనుకొనునట్లు నేను బావాజీనిగాను. నేనుత్తము రాజపుత్రఁ వంశస్థుఁడను. మా కాపురము జయపురము. కాలవశమున నేను స్వదేశమునుబాసి ఢిల్లీ చక్రవర్తియొద్ద పౌజుదారుగ నుంటిని. నేనును నాకుమారుఁడగు జనార్ధన సింగును కిల్జీ వంశస్థాపకుఁడగు జలాలుద్దీనువద్ద సేనానాయకులుగా నుండి యతని యన్నకుమారుఁడును బ్రస్తుత చక్రవర్తియునగు నలాయుద్దీనుతో గూడి దక్షిణ హిందూస్థానముపై దండెత్తినారము. అచట మహారాష్ట్ర రాజ్యమును జయించినపుడు నేను జాల సహాయమును జేసినాడను. జలాలుద్దీనుకు నాయందు పుత్రవాత్సల్యముండెను. దక్షిణ హిందూ దేశము నుండి వచ్చిన తరువాత నలాయుద్దీనుకు బినతండ్రిని గపటముగ వధించి తాజక్రవర్తి యగుటకు దురుద్దేశము కలిగెను. ఆకాలమున నాతని కాంతరంగికుడ నగుటంజేసి నాతో నాతడాలోచింపగా నేనట్టి దుష్కార్యమున కీయకొనక నిరుత్సాహము గలిగించి రాజభక్తి వలన యువరాజును గొంచెము నిందించినాడను. అలాయుద్దీను మహాగ్రహముతో మరలిపోయి యా రాత్రి – హా! ఏమి చెప్పుదును. నా రెండుకన్నులును దనఖడ్గముతో బొడిచివైచి నాకు శాశ్వతమయిన యంధత్వమును దెచ్చిపెట్టెను. తరువాత నన్ను జంపుమని సుబేదారులలో నొకని కతడుత్తరువిచ్చి నాప్రియపుత్రకు నారాత్రి జంపించెను. నాపూర్వ స్నేహితులందఱు నన్ను జంపకుండ మాయోపాయములచే రక్షించి నన్నీ గ్రామమునకు బల్లకిలోబంపిరి. ఈ పిల్ల యప్పటి కేడు సంవత్సరముల పసికూన. నిష్ప్రయోజనమైన యాజీవనము కంటే మరణమే యుత్తమమని తలచియు నీపసికూన