పుట:Hemalatha by Sri Chilakamarthi Lakshmi Narasimham.pdf/115

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

114

హేమలత

నిష్కారణముగ దురభిప్రాయము కలిగినది. ఆమె సద్గుణపుంజము సుమీ. నీకు నిలకడమీద నిజము దెలియును నీ మాటలచే నన్ను బాధింపకుము” అని పలికెను. ఎట్లయిన నీవు దీనిని వివాహమాడ వలనుగాదుసుమీ యని సువర్ణాబాయి లోపలి కరిగెను. మదనసింగు సందేహాస్పదహృదయముతో దన ప్రియురాలున్న గదిలోనికిబోయెను. అచట మంచపుపై బవ్వళించియున్న యాబాలిక మేలిముసుగు వెంటనే మొగమున వైచికొని రోదన మొనర్చుచు మదనసింగు పాదములపైబడి యిట్లు చెప్పసాగెను. “ప్రాణేశ్వరా! మీతల్లి గారును సేవకులును నన్నవమానించుచున్నారు. నేనెందైన బడి మృతినొందుటకు సిద్ధముగ నున్నాను. మీదర్శనము జేసిపోవలెనని జీవించితినిగాని యిదివఱకే నేనుమృతినొందవలసినది. నామీద మీరింత నిర్దయబూనుట ధర్మముగాదు. మాతాత మీకు జేతిలో జేయివైచి నన్నప్పగించినాడు గదా, యని విలపించుచున్న ప్రియురాలి మాటలకు హృదయముకరగ మదనసింగు నిరుత్తరుడయ్యెను. ఆమె యంతటితో నిలువక మూడుత్తరములదీసి నా విషయమై మౌలవి నాజరుజంగు ప్రముఖులకు వ్రాసిన యుత్తరములుజూడుడు. అందు నాసత్ప్రవర్తనముగూర్చి యాయన యెట్లుశాఘించినాడో మీరెరుగుదురు. అని యుత్తరముల జేతికిచ్చెను. మదనసింగు వానింజదువుకొనిన తరువాత నారాత్రి తన ప్రియురాలి విషయమగు విచారమును భీమసింగునుగూర్చిన వింతయు దన్ను బాధింప జిదానంద యోత్రోదన కాలము గడుపుట యుచితమని యెంచి యాతనిమఠమున కరిగెను. యాతనిమొగముజూచి యోగికారణమును జాలసారులు తఱచితఱచియడుగ మదనసింగు తన ప్రియురాలి విషయమున చర్య నెఱిగించెను. హేమలత మదనసింగునియింట వసించుచున్నదని యోగివిని యామెపయి నపనింద వచ్చినందులకు జింతించి మదనసింగుతో “ఆమెవచ్చినదా? తల్లిదండ్రులు