పుట:Hemalatha by Sri Chilakamarthi Lakshmi Narasimham.pdf/101

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

100

హేమలత

హేమలత వారిని వదలలేక కన్నీటితోఁ బల్లకి నెక్కెను. శివప్రసాదామెను నొంటిగా విదేశీయులతో బంపుట యుచితముగాదని మిగులఁ గృతజ్ఞుడును, శూరుడునగు లాహిరియనుఁ వొక శూద్రుని బల్లకివెంట సహాయముగనంపెను. మఱియును ఢిల్లీనగరముమీఁదుగఁ దీసికొనిపోవలదనియుఁ జిత్తూరు నగరముననకుఁదిన్నగఁగొని పోవలసినదనియు, బ్రాహ్మణుఁడు చెప్పి సాగిపొమ్మని బోయల కాజ్ఞాపించెను. లాహిరియును నిరువురు సేవకులను వెంట రానందఱ దగ్గఱ వేఱువేఱు సెలవుఁగైకొని హేమలతఁ జాముప్రొద్దువేళ కుల్వా పురమును బాసి మదనసింగును గలసి సుఖించున పేక్షతోఁ బ్రయాణము చేయుచుండెను. లాహిరి స్వామిభక్తి గలవాడు. సాహసుండె యగునుగాని యొకరేమిచెప్పిన నది సులభముగ నమ్మి మోసపోయెడు మూఢుఁడు. అందుచేతనే శివప్రసా దాతనితోఁ బలుమాఱు జాగ్రత్తగా నుండుమని చెప్పెను. లాహిరియు సాధ్యమైనంత వరకప్రమత్తుఁడై పల్లకి వెంటనడుచుచుండెను. ఇట్లు కొంతదూరము ప్రయాణము చేసినతరువాత వారు ఫజీబాదుకడకు సాయంకాలమునకు వచ్చిరి. ప్రయాణము వలన డస్సియున్న బోయలు కొంచెము కల్లునీరు త్రాగుటకు గ్రామముననొక చెట్టు క్రింద బల్లకిని దింపిరి. కూడనున్న సేవకులిద్దఱు గంజాయిదమ్ముపీల్చగ జూచి లాహిరి మనస్సు పట్టజాలక తానును రెండు గ్రుక్కలు పీల్చెను. తదనంతరము బోయలు వచ్చి మరలఁ బ్రయాణమునారంంభించిరి. ఫజీబాదు దగ్గరనే చిత్తూరునకరుగుటకు వేఱుబాటను గ్రహింపవలయును అయినను, బోయలును సేవకులును మార్గమును దప్పింపక ఢిల్లీవైపుఁ బోవుచుండిరి. లాహిరి యదివఱకు మార్గమును మార్పుఁడని వారి నడుగఁ దలచియు మత్తుచే సమయమున కూరకుండి వారితోఁ గలిసి చిత్రములైన పాటలు బాడుచు