పుట:Hello Doctor Final Book.pdf/151

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

రక్తఘనీభవనమును ఇనుమడింపజేస్తాయి. గర్భిణీస్త్రీలలో, కాన్పు తర్వాత రక్తపుగడ్డలు ఏర్పడే అవకాశము హెచ్చు.

జన్యుపరముగా కొందఱిలో రక్తఘనీభవనమును అరికట్టు మాంసకృత్తుల లోపము వలన రక్తపుగడలు ్డ ఏర్పడే అవకాశములు పెరుగుతాయి. మాంసకృత్తి ‘సి’, మాంసకృత్తి ‘ఎస్’  (Protein C, Protein S,) ఏన్టి థ్రాంబిన్ (Antithrombin AT) లోపములు ఉన్నవారిలో రక్తపు గడ్డలు ఏర్పడే అవకాశములు హెచ్చు. ఈ లోపములు factor V Leiden, prothrombin gene G20210A అనే జన్యువు మార్పుల (mutation) వలన కలుగుతాయి. సిష్టాథయొనిన్ బి సింథేజ్ (cystathionine B synthase) అనే జీవోత్ప్రేరకపు (enzyme) లోపము వలన రక్తములో హోమోసిష్టిన్ ప్రమాణములు పెరిగిన వారిలో రక్తఘనీభవనము ధమనులలోను, సిరలలోను కూడా త్వరితము కాగలదు. వీరు మూత్రములో హోమోసిష్టిన్ విసర్జిస్తుంటారు (Homocysteinuria). Paroxysmal nocturnal hemoglobinuria (PNH ) (సంవిరామ నిశా రక్తవర్ణక మూత్రము) అనే వ్యాధి కలవారు అప్పుడప్పుడు రక్తవర్ణకమును (hemoglobin) మూత్రములో విసర్జిస్తుంటారు. వీరిలో రక్తపుగడలు ్డ అసాధారణపు తావులలో (ex : cavernous sinus, mesenteric vein, portal vein thrombosis) కలిగే అవకాశములు హెచ్చు.

Anti phospholipid antibody syndrome APS  అనే వ్యాధిగ్రస్థులలో స్వయంప్రహరణ ప్రతిరక్షకములు (auto antibodies) వలన రక్తపుగడ్డలు ఏర్పడే అవకాశములు ఎక్కువ. ఈ వ్యాధి గల స్త్రీలలో గర్భస్రావము, మృతపిండ స్రావములు ( stillbirths ) కలిగే అవకాశములు హెచ్చు. నిమ్న సిరలలో రక ్తఘనీభవన లక్షణములు :-

కాళ్ళ నిమ్నసిరలలో రక్తపుగడ్డలు ఎక్కువగా ఏర్పడుతాయి. చేతుల సిరలలో చికిత్సలకై కృత్రిమ నాళికలు ఉన్నపుడు, సిరల రక్తప్రవాహమునకు ఇతర అవరోధములు ఉన్నపుడు భుజసిరలలో కూడా రక్తపుగడలు ్డ ఏర్పడవచ్చును.

150 ::