పుట:Haindava-Swarajyamu.pdf/97

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

94

హైందవ స్వరాజ్యము

యారము దొంగసొత్తో, స్వార్జితమో, దానమో ఆగ చున్నది. ఈ రీతిని మూడువిధములగుసాధనముల చేత మూడువిధములగు ఫలము లేర్పడుచున్నవి. సాధనములతో ఫలమునకు సంబంధము లేదని ఇంకను వాదింతురా?

దొంగను పారదోలవలెనని మీరిచ్చిన యుదాహరణమును విమర్శింతము. ఏసాధనమైనను దొంగను పారదోలునని నేను నమ్మను. మాతండ్రి దొంగలించుటకు వచ్చెను. అతనిని తప్పించుకొనుట కొక యుపాయము వెదకుదును. నాకు తెలిసినవాడు ఆపనికి దూరె ననుకొందము. ఇంకొకవిధమగు సాధనమును వినియోగించుకొందును. ఎవ్వడో సంబంధము లేనివాడు దొంగ. అప్పటియుపాయమే వేరు. తెల్లవాడు దొంగ యైన నల్లవానియెడల నుపయోగించు సాధనముకాక ఇంకొక సాధనము నుపయోగించెదరు కాబోలు మీరు. బలవి హీనుడు, ఒక్కికట్టె దొంగయైనయెడల సమబలునియెడల నుపయోగించు నుపాయమును వినియోగింపబోము. ఆపాద మస్తకము ఆయుధధారి యగునేని కిక్కుమిక్కుమనక యూర కుందుము, ఈవిధముగా దొంగయొక్క స్వభావము ననుసరించి అతని నివారించునూర్గములు మారుచుండును. ఇంతేకాదు. దొంగ నాతండ్రియైనను, ఆపాదమస్తకము ఆయుధములు ధరించిన ఆమోటరియైనను, నేను నిద్రించుట నభినయింతును ఏల, నాతండ్రికూడ సాయుధుడుగా రావచ్చును.నాకు ఇరువుర