పుట:Haindava-Swarajyamu.pdf/35

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది
32

హైందవ స్వరాజ్యము.


లక్షలకొలది వైద్యులువానికి ప్రతీకారములను వెదకుచున్నారు. అందుచేత వైద్యాలయములు పెరిగిపోయినవి. ఇది నాగరకము. పూర్వము ఉత్తరములు తీసికొనిపోవుటకు ప్రత్యేకము దూత లవసరమయి యుండినారు. ఎంతో ద్రవ్యము వ్యయము చేయ వలసి యుండినది. 'నేడో ఎవ్వరిని తిట్టదలచుకొనినప్పటికి కొణి కాగితమువ్రాసి పడవేయ వచ్చును. అంతటితోనే అడకువతో కృతజ్ఞతను కూడ తెలుపవచ్చుననుటయు నిజమే. పూర్వము ఇంటిలో చేసిన బువ్వకూరలతో మూడుపూటల భోజనముండి నది, ఇప్పుడో గంట గంటకు ఏదో తిండి కాఫీ హోటలులో తినవలెను. దీస్ కే సగ మాయువు పట్టుచున్నది. వేరుపనికి వేళ యేలేదు. ఇంకను నేను చెప్పవలసిన దేమికలదు ? ఇగంతయు ఉత్తమ రచకులే వర్ణించినారు. ఇవియన్ని యునాగరకమునకు చి హ్నము లే.ఎవరైనను కాదందురా వారుశుద్ధమూర్ఖులని తెలియ వలసినదే. ఈ నాగరకములో నీతిమతములకు తావు లేదు. తద్భ కులు మతము నేర్పుట మాపని గాదని ఘంటాపథముగ చెప్పు దురు.అందులో కొందరు మతముమూఢవిశ్వాస మనియు నం దురు. మరి ఇతరులో, వేషము వేసికొని శ్రీరంగనీతులు బోధిం తురు. అయిన ఇరువది యేండ్ల అనుభవము మీద నాకొక్క నమ్మక మేర్పడినది. నీతియని నేర్పునది యెక్కువగా అవినీతి యే. నేను పైన వర్ణించిన జీవితక్రమములో ఎక్కడను నీతికి