పుట:Haindava-Swarajyamu.pdf/285

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ద్వితీయభాగము.

277

కన్నుల బాష్పంపుఁగణము లందంద
చన్ను గుబ్బల మీఁద జలజల దొరుఁగఁ
బొరిఁబొరి వగచుచు భూవల్లభునకుఁ
గరుణ రా గద్గదకంఠి యై పలి కేఁ
“బురుషవ రేణ్య యీపురి నొక్క విప్ర
వరునింట దాసి నైవర్తించు చుందు......................2110
నప్పు ఏర్పఁగ నుపాయము మఱి లేక
తప్ప నాడక పతి ద న్న మ్ము కొనియె
నాసుతుఁ డితఁ డంసనారి నా పేరు
భూసురుం డడవికిఁ బుత్తెర వేల్మి
కట్టెలకై వచ్చి కడు నుగ్రమైన
కట్టిడిభుజగంబుకాటునఁ జచ్చె
ననఘ మీ రెవ్వ రిట్లనుకంప మీర
దనశోక ముడుపఁ జిత్తమునఁ దలంచి
విచ్చేసి నట్టియావిశ్వనాథుఁడవు
నిచ్చలు బహుభూత నివహంబు గొలువ..............2120
నిచ్చలుఁ బ్రియ మార నీ రుద్రభూమి
నచ్చుగా విహరించునాభూతపతి వై
యెఱిఁగి యుండితి రేని యేమైన మందుఁ
గరుణ నిచ్చి సజీవిగా వీనిఁ జేసి

..............................................................................................................

డక = లేదు పొమ్మని అబద్ధము చెప్పలేక , తన్నమ్ముకొనియెన్ = నన్న మ్ముకొ నెను, భూ సురుఁడు=బ్రాహ్మణుఁడు, పుత్తరన్ =పంపఁగా, వేలి కట్టెలు= హోమమునకై 'నసమిధలు, కట్టిఁడిభుజగము=క్రూర మైన సర్పము, అనుకంపవయ, తనశోకము = నాశోకము, విశ్వనాథుఁడవో= కాశీ విశ్వనాథుఁడవో, భూతపతివో=శవుఁ