పుట:Haindava-Swarajyamu.pdf/280

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది
272

హరిశ్చంద్రోపాఖ్యానము

చావఁడు వీఁ డని చర్చించి మఱియు
భావించి యిది యేల వలవని యాస
వత్తు రే చచ్చినవారును మరల
ని త్తరినిటు చావ నిది కట్ట డయ్యె
నిన్నియుఁ గల్ల లూహింపఁ గౌశికుఁడు
నన్ను వేదనఁ బెట్ట నలిఁ బన్ని నట్టి
మాయ గా కని దైవమా' యని కొడుకుఁ
బాయనియక్కునఁ బట్టి పాలిండ్ల......................................2030
నొత్తి 'యో యమ్మ చ న్నొల్లం' డన్ శోక
మొత్తి యా కఱచిన యురగంబు దలఁచి
శ్రుతి బాహ్యుఁ డిలఁ బుట్టు గ్రుడ్డు తామనుఁడు
గలి చెడ్డ చెడుగు తెక్కలి బొక్క లాఁడుఁ
బదవిహీనుఁడు జగ త్ప్రాణభక్షకుఁడు

.................................................................................................................


ఇఁక నే నెట్లు బ్రదుకుదును , వలవనియాస= కూడనియాస, కట్టడి = ఏర్పాటు, పాయ నియక్కునన్ = కొడుకు నెన్నఁడును ఎడఁ బాసియుండని తన రొమ్మునందు, ఓయ మ్మచన్నొల్లఁడు ఆన్ శోకము= ఓయమ్మా చన్ను నొల్లఁడేయ నెడి శోకము, ఉర గము=పాము, శ్రుతి బాహ్యుఁడు= చెవులు లేనివాఁడని సర్పపరము - వేద బాహ్యుం డని అర్థాంతరము, పుట్టుగ్రుడ్డు= గ్రుడ్డునఁ బుట్టినది, అని సర్పపరము-పుట్టినది మొ దలుగా గ్రుడ్డియైనవాఁడని యర్థాంతరము, తామసుఁడు= నీచుఁడు, తామసస ర్పజాతి, గతి చెడ్డ చెడుగు= దారి సరిగా లేక పంకర గానుండుదుష్టజంతువు-దా రితప్పినదుష్టుఁడని యర్థాంతరము, తెక్కలి=దొంగ, బొక్కలాఁడు బొక్క లందుండువాఁడు - దాఁగుపోతని యర్థాంతరము, పదవిహీనుఁడు = కాళ్లు లేని వాడు - అంతస్తు లేనివాఁడని యర్థాంతరము, జగత్ప్రణభక్షకుఁడు=వా యువునుభక్షించువాఁడు, జగత్తులోని వారి ప్రాణములనుభక్షించువాఁడు.