పుట:Haindava-Swarajyamu.pdf/257

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ద్వితీయ భాగము.

249

నెరసులుఁ దప్పులు నెమకుచు నొక్క
వెరవు చిత్తంబున వెదకి 'సత్యంబు
తెరలంగ వీని ప్రతిజ్ఞఁ దప్పించి
కరమి. మొనరింతుఁ గాళిక మునికి,
నని నిశ్చయము సేసి యావీరబాహుఁ
డొనరంగ నొక రాత్రి యుర్వ్త లేంద్రు
తొడలపై ( బదములతుదఁ జాఁపి భక్తి
నడుగు లొత్తుచు నున్న నతనిమనంబు
నొరయ మాయా నిద్ర నొంది రే యెల్ల
జరణ సేవ యొనర్చుజననాథుఁ జూచి...............................1600
'యోరి నీదెస నాకు నుల్లంబునందు
వారక కొంతవిశ్వాసంబు వెడమెఁ
బన్నుగా నా సేయుపనులపై నిన్ను
మన్నించి నిలి పెద మది నఱ లేక
వినుమది చెప్పెద వివరంబు గాఁగఁ
బెనుపొంద నీ పురి ప్రేతవనంబు
నా గుత్తగాఁ జేసినాఁడ నీ వచటి
కేఁగి పీనుఁగుఁ గాటి కెవ్వరేఁ దెచ్చి
కైకొని తమయిచ్చ గాఁ గాల్చి మరలి
పోకుండ నాయానఁ బొడిచి యాశవము...........................1610

.................................................................................................................

దోషములు, తెరలంగన్ = తప్పిపోవునట్లు, ఆత నిమనంబు నొఱయన్ = ఆతని మనస్సునొ త్తి చూచుటకు, అఱ= సంకోచము, 'కాటికిన్ = వల్లె కాటికి, ఎవ్వరేన్ = ఎవ్వరైనను, తమయిచ్చగాన్తమయిష్ట ప్రకారముగా మనయుత్తరు వులేక తమయిష్టము చొప్పునననుట, మరలిపోకుండ = తిరిగిపోకుండునట్లుగా,