పుట:Haindava-Swarajyamu.pdf/203

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

193

ద్వితీయ భాగము.

నచ్చుగాఁ దీర్తు మాయ ప్పని కొన్ని
యచ్చిక బుచ్చిక లాడి పత్రములు
గెంటక యిచ్చి యాక్రియ నూరు వేలు
గంటఁబిడకలు గట్టి గైకొని పిదప)
లండుబోతులఁ దనలాగు 'పెన్ లజ్జ
బండలఁ గొందఱఁ బాటించి తెచ్చి
టక్కరి పూట తాటలు సేసి ధనము
చక్కనఁ గైకొని జరిగినపిదపఁ
దనజాడ దెలిసి క్రంతకుఁ దీసి రేని
మనమున బెదరక మానంబు విడిచి
కట్టుఁ గొట్టును బడి కరకరి కోర్చి
చట్టు పెట్టిన మోచి సరి యాక నుండు
ఘటిక సిద్ధుఁడు రాయిఁ గొట్టిన గొడ్డ
లటమట కాడు మహామాయలాఁడు

...................................................................................................................

నట్లు-అతిరహస్యము గాననుట, అచ్చిక బుచ్చికలు=కలుపుగోలుతనములు, కంట ...గట్టి=కంటిలో పిడకలుగట్టి-కన్నుఁ బామియనుట. లండుబోతులు=దుండ గీండ్లు, దనలాగు పే లబండల = తనవంటి లజ్జమాలిన ధూర్తులను, టక్కరి పూఁట తాటలు=జిత్తులమారి పూఁటకాఁపుమోసములు- మోసపుపూఁటకాఁపుత నములనుట- మోసగాండ్రను పూఁట కాఁపులుగా పెట్టి యని భావము. జరిగినపిద ప= తాను దీసికొన్న ధనమంతయు వ్యయ మైనపిదప, తనజాడ = తానుధనమంత యు లేకుండుజాడ, క్రంతకున్ = రచ్చకు, కరకరి క్రూరత్వము, చట్టు=చ ట్రాయి-దండ నార్థము పూర్వము చట్టురాతిని అపరాధుల పై మోపించుట గలదు, ఆఁక = చెఱ, ఘటిక సిద్ధుఁడు=గుళిక గలయోగసిద్ధుఁడు, రాయిఁగొట్టిన గొడ్డలి= రాతిని బగులఁగొట్టిన గొడ్డలి,అటమటకాఁడు = 'మోసగాడు, గడుసు