Jump to content

పుట:Haindava-Swarajyamu.pdf/189

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ద్వితీయ భాగము.

181

దొననీళ్లుఁ జల్లు వేఁదుజుఁ డెందుఁ గలఁడె...................... 420
యాలు బిడ్డలు దగులని మున్నె రోసి
చాలించి నట్టి నిస్సంగుని నైనఁ
జేసిన నేరమి చేనేత, గుడువఁ
జేసి యీబూమేలు సేసె దైవంబు'
ననుచుండ మఱి కొంద ఱకట యీ రాజు
నన నేల విపుల కవనివల్లభులు
దగినదానము లీరొ ధన మియ్యం గొనరొ
పగ గొని యీరీతిఁ బట్టి యర్రదిమి
దార లెక్కలకునై తరువులు వెట్టి
దారల నమ్మించి ధనములు గొనెడి..............................430


..................................................................................................

ఇమబ్బు, దొన= కొండమీది నీటిపల్లము, వేఁదుఱుఁడు =వెర్రివాఁడు - ఇక మీద మబ్బులు గురియఁగల వానను నమ్మి యిప్పుడు సిద్ధముగా నున్న దొన నీళ్లు వెచ్చించుకొను వెట్టివాఁడుగలఁ డాయనుట =సందేహగ్రస్తమైన వానను నమ్మి నిశ్చితముగానున్న దొననీళ్లుఁ జల్లివై చునట్లు, సందేహాస్పదము లైన స్వర్గభోగా దులను నమ్మి యిహసుఖభోగములను పోఁగొట్టుకొనుట వెర్రి తన మేయని భానము; తగులు= తగులము, చాలించినట్టి నిస్సంగునిక్ = సంగము వదలుకొన్నట్టి విరక్తుని, చేసిన నేర మిన్ = నేరక చేసిన తప్పును, చేనేత = ఈ చేతి కా చేయిగా-తోడ్తోట చేయనుట, కుడుపఁ జేసి= అనుభవింపఁ జేసి, ఈబూ మెలు = ఈ వంచనలు - ఆలు. . . దైవంబు = ఈ హరిశ్చంద్రుఁడు రాజ్యము సేయుచున్న కాలమున నే ఆలుబిడ్డలు బంధకము లని రోసి లోపల సంగము వదలికొనియున్న రక్తచిత్తుఁడు. ఇట్టి నిస్సంగుఁడ నిగూడ తలఁపక , దైవము ఇతఁడు తెలియక చేసిన నేరమును తోడ్తో అనుభ వింపఁ జేసి యిట్లు వంచనలు చేసినదని యర్థము, అర్రుఅదిమి = మెడఁద్రో క్కి మిక్కిలినిర్బంధ పెట్టి, దార లెక్కలకు నై= దానము చేసినదాని లెక్కలు ఒప్పగించుకొనుటకై , తరువులు తప్సీలు, దారల = భార్యలను, శఠము= ధూ