పుట:Haindava-Swarajyamu.pdf/123

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

120

హైందవ స్వరాజ్యము.

ఆడినంతమాత్రన కార్యము సాధించుట కాదు. ఈమాట లైనను మీకు చెప్పగలనేకాని దేశములోని కోట్లసంఖ్యాక మగు సోదరబృందమునకు చెప్పలేను. మన విద్యాపద్ధతిని ఖండించుటకు ఇదియే చాలును. దానిలోపములనుండి వీడ్వడినానని నాతలంపు కావున మీకును నామార్గ ముపదేశంప తల పెట్టినాను.

అక్షరజ్ఞాన మంతట పనికిరా దనరాదు. అయిన దానినే పెద్దచేసి శరణ్య మనరాదు. అది కామధేనువుగాదు. మన ప్రాచీనవిద్యాపద్ధతి మంచిది. దానిలో శీలనిర్మాణము ప్రధమాంగము. అదియే నేర్పదగిన ప్రథమవిద్య. దానిపై కట్టు హర్మ్యము ఉత్తమస్థితము. నేటివిద్య గడించి దానికి రంగు పెట్టవచ్చును.

చదువరి: ఐన ఇంగ్లీషువిద్య అనవసర మని మీరందురా ?

సంపా: అవసరము, అనవసరము రెండును. కోట్లప్రజకు ఇంగ్లీషునేర్పుట వారిని దాస్యమున వేయుట. మెకాలే ప్రభువు మనవిద్యకువేసిన బునాదులు మనలను దాసులం జేసినవి. అతనియుద్దేశ మది కాకపోవచ్చును. ఫలముమాత్రము తప్ప లేదు. స్వరాజ్యమునుగురించి మాట్లాడుటకుకూడ మన కింగ్లీషే కావలసివచ్చినది. అది సిగ్గుమాలినస్థితి కాదా?

ఇక మనవిద్యాపద్ధతు లందురా సీమలోవా రేకాలముననో త్యజించినవి మనకు నే డమృతప్రాయములు. ముఖ్యమంత్రి