పుట:Gurujadalu.pdf/658

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

రెండు కలవు. 1893 సం|| యపిగ్రాఫిష్టుగారి రిపోర్టును 11వ పుట చూడుడు. ఒక శాసనపు కాలము 1062 శాలివాహన శకము. బెజవాడ శాసనపు యుద్ధమల్లుడు చాళుక్య వంశము లోని వాడన్నమాట బెజవాడ శాసనము లోనే చెప్పబడి యున్నది. ఆరవ పంక్తిలో “రాజసల్కి భూవల్లభుండు” అని వున్నది. సల్కి అనగా చాళుక్య, రెండవ పులి కేశి యొక్క హైదరాబాదు శాసనములో చిలిక్య అనే రూపమున్నది. చాళుక్యుల యింటి పేరు అనేక రూపములుగా వుండెను. బొంబాయి గెజిటీయరు 1 టవ సంపుటం 2వ భాగములో షీటు దొరగారు Dynasties of the Canarese districts 336, 337 పుటలు చూడుడు. కే.బీ. పాఠకకవి రాజమార్గము 8వ పుట కూడా చూడుడు. గౌరీశంకరు ఓగారి సోలంకేయుల చరిత్ర కూడా చూడుడు. గురుజాడలు 613 ఆంధ్ర కవితాపిత