పుట:Gurujadalu.pdf/622

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

________________

బూలర్ ఇండియన్ పెలియాగ్రఫీకి యింగ్లీషు తర్జుమా బొంబాయిలో యెడ్యుకేషనల్ సొసటీ ప్రెస్‌లో దొరుకును. | Educational society's Press Bombay, “శాసనమునందున్న పురుషులను బట్టి, కాలము తెలిసికొందుమనిన నట్లగుచో నీ శాసనము రాజరాజ నరేంద్రునకు దరువాత వ్రాయ బడినట్లు తోచు చున్నది. గానీ పూర్వము నందు వ్రాయబడినట్లు తోచుట లేదు. “శ్రీయుత అప్పారావు పంతులు వారీ శాసనము రాజ రాజ నరేంద్రునకు బూర్వముదని వ్రాయించిరి. కాని వారు వ్రాసిన దానితో నేనేకీభవింపజాలను” అని బ్రహ్మయ్య శాస్త్రులు గారు వ్రాసిరి. ఇట్టి అభిప్రాయమునకు శ్రీశాస్రులు వారు చెప్పిన యుక్తులు యివి అని అనుకుంటాను: (అ) బెజవాడ శాసనములో శాసనకర్త పేరు మల్లుడు, యుద్ధ మల్లుడు అని కూడా వున్నది. తాతపేరు మల్లపుడు. ఇట్టి లక్షణము గల (యుద్ద) మల్లుడు రాజ నరేంద్రునకు బూర్వమునందు లేడు. (ఆ) ఈ శాసనమున పేర్కొన బడిన యుద్ధమల్లుడు తూర్పు చాళుక్యుడని వ్రాయబడి యుండలేదు. (ఇ) రాజరాజనరేంద్రున కిటీవల మల్లపు దేవుని మనమడైన మల్లుడొకడు కాన్పించుచున్నాడు. ఇతడు క్రీస్తు శకము 1202లో బరిపాలనము చేసినాడు. బెజవాడ శాసనపు యుద్ధమల్లుడు క్రీస్తు శకము 927 నుండి 934 వరకూ తూర్పు చాళుక్యులసింహాసన మెక్కి పాలించిన యుద్ధమల్లుడయే వుండునని నా అభిప్రాయము. శాస్రుల వారు పేర్కొనిన మల్లపుదేవుని శాసనము క్రీస్తు శకము 1202 నాటిది. ఆ సంవత్సరమున ఆ రాజు పిఠాపురమున పట్టాభిషిక్తుడాయెను. ఈ శాసనము యెఫిగ్రాఫిక్ ఇండియాలో 4వ సంపుటములో 231 పుటను ప్రచురింపబడినది. పటము ఆరవ సంపుట 270 పుటను కలదు. ఈ శాసనపు లిపి బెజవాడ శాసనపు లిపితో చేర్చి చూసిన వెంటనే దీని కొత్త బయలుపడును. గాన నీమల్లపను గూర్చి చర్చించుట అనవసరము. అయినను పిఠాపురపు శాసనపు తెలుగు భాగము మొదటను, మల్లప పేరిట్లీ బడినది. 86 పంక్తి “స్వస్తి శ్రీ సర్వలోకాశ్రమ శ్రీ విష్ణువర్ధన మహారాజులైన మల్లపదేవ చక్రవర్తి" బెజవాడ శాసనములో ఈ రీతిని లేదు.