పుట:Gurujadalu.pdf/560

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది



సాహె : కంఛన్ క్యం నై ఆతేజీ?

కొండు : అబి ఆతే మహారాజ్

మంజు : గుల్లో కూచుని, తలుపు గడియ వేసుకున్నా ములే; నేను వెంకిని, సాయిబుని పైకి గెంటెయ్యి లేకుంటే వాడి చేత తాపులు తిను.

కొండు : ధర్మం కాదిదీ మంజువాణి వినుమా (Read like a verse}

దాగుంట, ధైర్యంబూనీ
నవలంబించియు పైకి వచ్చి మరియుమ్
ప్రాణంబు దక్కించుమా
లేకుంటే నిటదీపమార్పి మరియున్
నీకొంప కగ్గెట్టుదున్
నీవు న్నీ చెలికత్తె కూడ గదిలో
చిచ్చెట్టి చస్తారువై||

సాహె : బహుత్ అచ్చాగాతేజీ (అని తిరిగీ కొండుభొట్లును తట్టును)

మంజు, వెం : యెవళఱ్ఱో వీధిలోను? (అని గొంతెత్తి అరచును)

సాహె : క్యా గడ్‌బడ్ జీ?

కొండు : యెఘర్మె ఏక్ బడా బ్రహ్మరాక్షసికహతే. బడా బొమ్మన్ సైతాన్ హై.

సాహె : సైతాన్ గియితాన్ మార్దేతి (అని కఱ్ఱ సవరించును)

(పంతులు తలవిరబోసుకొని చేతులో లాఠీ పట్టుకుని కోపముతో)

(“ముండా మంజు వాణి” (అని తొందరగా ప్రవేశించును. )

(కొండుభొట్లుని చూసి) వెధవ పకీరు వెధవ! నువ్వుండేన యీ దౌర్జన్యం చేస్తున్నావు? (అని కొండుభొట్టును కర్రతో కొట్టును)

సాహె : యెహాయి బొమ్మన్ సైతాన్?

కొండు : హై మహరాజ్.

సాహె : (కర్రతో రెండు దెబ్బలు పంతుల్ని కొట్టేసరికి పంతులు చతికిలబడును)

కొండు : (వీధి తలుపులోపలి గడియ తీసి తియ్యబోతే రాదు) యెవడో తలుపు గొళ్లెం వేశాడురోయి! పెరటి తోవను పోదామంటే అడ్డంగా తురకాడున్నాడు! యిఖనేమి సాధనం (ఆత్మగతం) దీపం ఆర్పేస్తే పంతులు పారిపోతాడు. (దీపం ఆర్పేసి సాహెబు మీద, పంతులు మీద బిందెతో నీళ్లు విసురును.)

గురుజాడలు

515

కొండుభొట్టీయము