పుట:Gurujadalu.pdf/525

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

అక్కా : అయితే యిప్పుడేంచేస్తావు.

వెంక : యేం చెయ్యమంటారు.

అక్కా : తిన్నగా వెళ్ళి అరుగుమీద పడుకో.

వెంక : చీపురుకట్ట ముతకది.

అక్కా : నిష్కారణం దెబ్బలు తిండం యెందుకు? పార్వతి చెప్పినట్టు చెయ్యి.

వెంక : వెధవతో సంగమం చెయ్యమంటావయ్య.

అక్కా : నీ పింతండ్రికంటను నువ్వు గొప్పవాడివా యేమిటి? ఆయన యెన్నో పాడు దేవాలయాలు ప్రతిష్ట చేశాడు.

వెంక : మా తండ్రి మహా యోగ్యుడు. అయ్య పేరు చెడగొట్టుతానా.

అక్కా : హాశ్యానికన్నాను. బహుధర్మంగా ప్రవర్తించావు. నిన్ను చూచి చినబాబు బుద్ది తెచ్చుకోవాలి. నీవు వేలలో యెన్నికైన మనిషివి. గాని రేపటి నుంచీ యేలా కాలక్షేపం చేస్తావు.

వెంక : మధోకరం.

అక్కా : నేస్తం! నేనువుండగా నీకా అవస్థ రానిస్తానా? ఆ పది రూపాయిలు యేం చేస్తావు?

వెంక : పార్వతికి పంపించేస్తాను.

అక్కా : నేను యంత మదుపు పడితే అంత మదుపు పెట్టుతాను. పొడుం కొట్టుపెట్టి నీ కాలక్షేపము పోగా మనకి లాభం కూడా వస్తుంది.

(యిద్దరూ నిష్క్రమింతురు.)

కొండుభొట్టీయము

ద్వితీయాంకము

తృతీయ రంగము

(రామమూర్తి, చేతులు కట్టుబడి పార్వతమ్మ ప్రవేశించును)

రామ : యిదేమిటి పార్వతి.

పార్వతి : (కంట నీరొలుకుతూ వూరుకుండును. )

రామ : (దగ్గిరచేరి కూర్చుని) యే దుర్మార్గులు కట్టారు నీ చేతులు.

గురుజాడలు

480

కొండుభొట్టీయము