పుట:Gurujadalu.pdf/509

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

భీమా : యేమిటీ నాటకం.

మంజు : ముక్కోటి దేవతలు స్వర్గంలో ఉంటే, భూమ్మీద దేవతలు బ్రాహ్మణులని కొండిబొట్లుగారు శలవిచ్చారు. అందుచేత వేశ్య యింటికి అనుగ్రహించి వేంచేస్ని భూసురోత్తముల్ని కొలుస్తున్నాను.

భీమా : నీవు యెంత యెకసెక్యం చేసినా మేం దేవతలమే, అందుకు రవ్వంతైనా సందేహము లేదు.

మంజు : భూలోకంలో కృష్ణావతారం లాంటి రసికులు మీరు. కృష్ణావతారం కుదిరింది; కాని శాస్తులు గారు యే దేముడి అవతారమో పోల్చలేకుండా వున్నాను.

భీమా : పట్టణం వెళ్ళినప్పుడు పరంగీ స్త్రీల సహవాసం చేశానని చెప్పారు గనుక శాస్త్రుల్లుగారు సాక్షాత్తు నారదావతారం.

మంజు : అన్నా! మరచిపోయినాను. యెంత బుద్ది తక్కువ మనిషిని; దూరముగా నిలుచొండి. ప్రాయచ్చిత్తం చేసుకొంటేనే గాని దగ్గరకు రానియ్యను.

భీమా : శాస్త్రుల్లుగారూ! యేమిటండి ప్రాయచ్చిత్తం? నకక్షతమా? దంతక్షతమా?

కొండి : అది యెంత అదృష్టవంతులకు గాని సంప్రాప్తమవుతుంది. ముక్కుతిమ్మన్న ఏమన్నాడు.

“చ... నను భవదీయదాసుని..................
...................... అరాళకుంతలా.”

స్వేతముఖలు గనుక బ్రాహ్మడికి రజతదానం చేస్తే ప్రత్యువాయం పోతుంది. మా కుర్రవాడు మెటిక్లేషను పరీక్షకు కట్టాలి. యీ బీదబ్రాహ్మడికి దానం యిస్తే సమయానికి పనికి వస్తుంది.

మంజు : నిత్యసువాసినికి సువర్నదానం చెయ్యమని లేదా?

భీమా : (దీని తస్సాగొయ్యా బంగారపు సరకును మళ్ళీ తెమ్మంటుంది కాబోలు) తొందరపని వుంది. యిప్పుడే వెళ్ళి వస్తాను.

కొండి : మంజువాణి! బహు పుణ్యాత్మురాలివి, యేమైనా సాయం చేస్తేనే గానీ కుర్రవాడు పరీక్షకు వెళ్లే సాధనం కనబడదు.

మంజు : పంతులుగారి అప్పని అడుగరాదా?

కొండి : యెవర్నీ అడక్కుండా యేమయింది. వైదీకపాళ్ళని పుట్టించినప్పుడే బ్రహ్మ రాసిపడేశాడు.

“ముష్టెత్తుకొండర్రా” అని.

గురుజాడలు

464

కొండుభొట్టీయము