పుట:Gurujadalu.pdf/485

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

దూషణ యెలా కొట్టగలదో, నాకు బోధపడకుండా వున్నది. ఛాందసానికిన్నీ, రాజ్య . తంత్రానికిన్నీ చాలా దూరం వుంది.

నానా : నాతో దోషే వొప్పుకుంటేనే “ఆ తావళ మనేది, తాతాజీ మహారాజా వారు నేపాళం మహారాజులువద్ద సంపాదించారు. దానితో అర్జునుడు జపం చేసేవాడని ప్రతీతి కూడా కద్దు. శివపూజా కాలమందు మహా ప్రభువువారు, నమస్కరించి, కళ్ళ నద్దుకుని మరీ ధరించేవారు. మీ యందు వుండే అసమాన గౌరవము చేత మీకిది అనుగ్రహ పూర్వకముగా దయచేశారు. అది యెందుకు వక ఆస్థాన పండితుడికి బహుమానంగా యిచ్చావయ్యా" అని నే నడిగితే, యేవన్నాడంటే, “యీ కుళ్లు తావళానికి యీ దేశంలో కాబట్టి యింత మాన్యత కలిగింది, మా దేశంలో ప్రతి తుప్పనిండా ఏకముఖీ రుద్రాక్షలే. తెగించి నాకు యింత బహుమానం చేశినందుకు మీ రాజు బెంగ బెట్టుకోలేదు గదా?” అని నిర్మొహమాటంగా అన్నాడు. నా కంటూ ఆ మాటతో వొళ్ళు నీరు విడిచిపోయింది.

విదూ : యెప్పుడు ఈ ప్రసంగం జరిగిందో?

నానా : నీ ప్రశ్నలకు సమాధానాలు నీలాటివాళ్లే చెబుతారు.

కర్ణ : చిత్రం, కొందరికి యెలకంటే బెదురు, కొందరికి పిల్లంటే బెదురు; నానామంత్రిగారికి గౌతములంటే బెదురు.

నానామంత్రి : ఆ మాట శలవివ్వవద్దు, మహాప్రభో! యేలినవారూ అమ్మాజీవారూ తప్ప లోకంలో నాకు బ్రహ్మ భయం లేదు.

విదూ : యముడి భయవేఁ లేనివాడికి, బ్రహ్మభయం యెలా వుంటుంది !

కృష్ణ : వారు చెబుతూవున్న సాక్ష్యం అబద్ధవోఁ, నిజవోఁ, కొసాకూ వినరాదూ?

కర్ణ : తరువాతండి?

నానామంత్రి : తరవాతేవొచ్చి, మళ్ళీ అన్నాను “నారాయణభట్టుగారి విద్యను మహారాజులు తగినట్టు గౌరవించనట్టున్నూ, యీ విషయంలో మహారాజుల లోపమును మీరు యెత్తి పొడిచి సవరణ చేసినట్టున్ను లోకానికి అర్థం కాగలదు. మహారాజులు శాంతులని, యీలాటి నిరాదరణ చెయ్యరాదు” అని వేయి విధాల అతని మేలుకోరి, బోధ చేస్తే, “రాజులకేం తెలుస్తుందీ విద్యల విలవ? రాజులు విద్యాఘూకా"లన్నాడు.

విదూ : యీపాటికి బిల్హణుడు వూరి పొలిమేర దాటివుంటాడు. యెన్ని గోతాలు కోసినా ప్రతిబంధకం లేదు.

గురుజాడలు

440

బిల్హణీయము