పుట:Gurujadalu.pdf/431

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

కన్యాశుల్కము సప్తమాంకము వ స్థలము : విశాఖపట్టంలో వీధి (బైరాగీ, వెనుక పదిమంది శూద్రులు ప్రవేశింతురు) రామన్న : యెక్కణ్ణించి యిజయం సేస్తున్నారు గురూ? బైరాగి : కాశీ నుంచిరా! రామన్న: యెన్నాళ్ళైంది గురూ? బైరాగి : ప్రాతః కాలం గంగ సేవించి బయల్దేరామురా. రామన్న: యింత యేగిరం యెలాగొచ్చినారు గురూ? బైరాగి : పవనం బంధించి వాయువేగం మీద వచ్చామురా. బుచ్చన్న : యోగులికి సిద్ధులుండవురా? యీయనేరా, ఉప్పాకలోనూ సింవాచలంలోనూ మొన్న సివరాత్రికి వొక్కమారే అగుపడ్డారు. లక్ష్మన్న: తెల్లోడు తీగి టపా యేసినాడు కాడ్రా? నిమేటికి వుత్తరం దేశదేశాలికి యెల్లదా? బైరాగి : పామరులు! పామరులు! రామన్న :వూరుకొస్సి - నీకేటెరిక? యెట్టినాకొడక. బైరాగి : యీ వూళ్ళో తీర్థపురాళ్ళ రేవున రెండు మైళ్లు లోసబురున ధర్మరాజు వారు ప్రతిష్ఠ చేసిన శివాలయం, కంచు దేవాలయం ఒకటి వున్నది. రాత్రి ఆ దేవుణ్ణి శేవించుకొని, రేపు రామేశ్వరం వెళ్ళిపోతాం. సదావృత్తి యక్కడ దొరుకుతుంది? రామన్న : యీ వూళ్ళో మఠం లేదు గురూ. మేవంతుండగ తమకి లోపవేఁటి గురూ? కాశీ కబుర్లేటి గురూ? బైరాగి : నాలుగు రోజుల కిందట విశ్వేశ్వరుడి కోవిలలో ఒక బంగారపురేకు ఆకాశం మీంచి పడ్డది. దానిమీద వ్రాసిన లిపి బ్రాహ్మలికి యవరికీ బోధ అయింది కాదు. మేం చిత్తగించాం. సిద్ధుల భాషని దానిమీద బంగారం చేసే యోగం వకటి, కలకాలం బతికే యోగం వకటి వ్రాసివున్నాయి. రామన్న : యేవాఁచ్చట్లైం? గురూ భోజినం యేటారగిస్తారు? బైరాగి : పాలు, పంచదారా, అరిటి ఫలములూ, యీ ప్రకారం ఒక పక్షం ఫలహారం చేస్తాము. మరి పదిహేను రోజులు వాయుభక్షణ చేస్తాము. కన్యాశుల్కము - మలికూర్పు గురుజాడలు 386