పుట:Gurujadalu.pdf/425

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

కరట : మీ తల్లి అనగా యెంత బుద్ధివంతురాలు! దాని తరిఫీదు చేతనే నువ్వు విద్యా సౌందర్యాలు రెండూ దోహదం చేసి పెంచుతున్నావు? మధు : అంతకన్న కాపు మనిషినై పుట్టి, మొగుడి పొలంలో వంగ మొక్కలకూ, మిరప మొక్కలకూ దోహదం చేస్తే, యావజ్జీవం కాపాడే తనవాళ్లన్న వాళ్లు వుందురేమో? కరట : యేమి చిన్నమాట అన్నావు! మధురవాణి అంటూ ఒక వేశ్యా శిఖామణి యీ కళింగరాజ్యంలో వుండక పోతే, భగవంతుడి సృష్టికి యంతలోపం, వచ్చి వుండును? మధు : సృష్టికి లోపం వచ్చినా రాకపోయినా, యిప్పటి చిక్కులలో మీకు మట్టుకు కించిత్ లోపం వచ్చి వుండును. కరట : మమ్మల్ని తేల్చడానికి నీ ఆలోచన యేదో కొంచం చెప్పావు కావు గదా? మధు : నన్ను సౌజన్యారావు పంతులుగారి దగ్గరకు తీసుకువెళ్లడానికి వొప్పారు కారు గదా? కరట : ఆయన నిన్నూ, నన్నూ యింట్లోంచి కఱ్ఱ పుచ్చుకు తరుముతారు. మధు : కోపిష్టా? కరట : ఆయనకి కోపవఁన్న మాటే లేదు. మధు : ఐతే భయమేల? కరట : చెడ్డవారి వల్ల చెప్పుదెబ్బలు తినవచ్చును గాని, మంచివారివల్ల మాట కాయడం కష్టం. మధు : కొత్త సంగతి వకటి యీ నాటికి నాకు తెలిసింది. సృష్టికల్లా వన్నె తెచ్చిన మధురవాణి అనే వేశ్యా శిఖామణి గిరీశంగారి వంటి కుక్కల పొత్తుకే తగి వున్నది గానీ, సౌజన్యారావు పంతులు గారి వంటి సత్పురుషులను చూడడమునకైనా అర్హత కలిగి వుండలేదు. గిరీశంగారు దాని యింట అడుగు బెట్టగానే, మీ చెల్లెలు గారియింట, అడుగు పెట్టడానికి ఆయనకు యోగ్యత తప్పిందని మీ నిర్ణయం. తమలాంటి పండితోత్తములు మాత్రం కార్యావసరం కలిగినప్పుడు వూరూవాడా వెతికి, మధురవాణి దగ్గర లాచారీ పడవచ్చును. అయితే డిప్ట్ కలక్టరూ కుక్కేనా? కరట : లంచం తినడు గాని, ఆయనకు స్త్రీ వ్యసనం కద్దు. పెద్ద ఉద్యోగస్థుడు గనక, సీమకుక్క అని అందాం. ఆయన్ని గానీ వలలోవేశావా యేవిఁటి? మధు : వేస్తే? కరట : బతికానన్న మాట! ఆయన సాయం వుంటే, కేసు మంచులా విడిపోతుంది. తెలిసింది. యిదా నువు చేసిన ఆలోచన? యెంత గొప్పదానివి! గురుజాడలు 380 కన్యాశుల్కము - మలికూర్పు