పుట:Gurujadalu.pdf/398

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

రామ : నిమ్మళంగా వున్నావురా? అసిరి : యేట్నిమ్మళం బాబూ, సానమ్మొచ్చింది - ఈయమ్మకాసి సూడం మానేసినారు. డబ్బిచ్చే దాతేడి బాబూ? రామ : అసిరి, అడక్కపోతే, అమ్మైనా పెడుతుందిరా? అసిరి : ఆ సానమ్మ మా పెద్ద మనిషి బాబూ. రామ యేవిఁటి? యేవిఁటి? చెప్పొరే. చాలా రోజులైంది నీకు డబ్బిచ్చి యింద ఈ రూపాయి పుచ్చుకో.

అసిరి : నూరు దండాలు బాబూ! రామ : మధురవాణి మాట యేవిఁట్రా చెప్పబోయినావు? అసిరి : మా పెద్దమనిషి బాబూ. రామ : యవడె డ్రా దాందగ్గిరకీ? అసిరి - యవడె డ్రా? అసిరి : యవడెక్నా, యీపు పెట్టగొడతాది బాబూ. రామ : చెడ్డ మనిషన్నావు? అసిరి : కాదా? మొన్న హెడ్డు గారెళ్తే, యేపికూన్ని ఉసుగలిపింది కాదా? రామ : నిజం చెప్పావు. నీ మీద యెప్పుడైనా కోప్పడ్డదిట్రా? అసిరి : మాలాటోళ్ల మీద యెందకోప్పడతాదీ? బాపనాశ్లోస్తే తిడతాది. రామ : నువ్వు యెప్పుడూ నిజవేఁ చెబుతావురా అసిరిగా, అసిరి : సీ! అబద్దవాడితే బగమంతుడు ఒల్లకుంటాడా బాబూ? రామ : మీ బుగత యేం జేస్తున్నాడ్రా? అసిరి : తొంగున్నాడు బాబూ. రామ : నీకు మరో రూపాయి యిస్తాను - మీనాక్షిని సావిట్లోకి పిలుస్తావురా? అసిరి : నాశక్కవాఁ, బాబూ? ఆయమ్మ అయ్యగదులో పక్కేసుకు తొంగున్నారు. రామ : నువ్వు చిటికేస్తే, యక్కడున్నా లేచొస్తుంది. నేనెరగనట్రా. అసిరి : తెండి బాబూ, సూస్తాను. (రామప్పంతులు రూపాయి యిచ్చును. ఉభయులూ యింట్లో ప్రవేశింతురు) గురుజాడలు 353 కన్యాశుల్కము - మలికూర్పు