పుట:Gurujadalu.pdf/393

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

హవ : (పాటమాని, తంబూరా క్రిందబెట్టి) గదా! హెడ్డు : (శంఖంలాక్కొని) శంఖం అగ్గిలో పడేస్తాను. యెందుకు తానిస్తావు భాయి! దుకా : వొద్దంటే వినడు. హెడ్ : వినకపోతే దుకాణానికి రానియ్యకండి. అల్లరైతే మాకు మాటకదా! దుకా : పదిశంకాలు దాచేశాను; మళ్లీ మళ్లీ తెస్తాడు. యేం జెయ్యను. బేరంగదా భాయీ? మునస: దిట్టంగా పట్టేయి. తత్తఘనం తలకెక్కాలి ! దుకా : (తంబురా తీసిపాడును) నాగా దీగురా! నా తండ్రి దిగురా|| దిగుదిగు నాగన్న దివ్య సుందర నాగ ముదముతో రేపల్లె ముద్దుల నాగ|| ఊరికి ఉత్తరాన I ఊడలమణి కింద|| కోమపుట్టలోని కోడి నాగన్నా - (పాడుచుండగా రామప్పంతులు ప్రవేశించి యెడంగా నిలిచి యోగినికి సౌజ్ఞ చేయును. యోగిని రామప్పంతులుతో మాటలాడి వచ్చి హెడ్ చెవిలో రహస్యం చెప్పును.) మున : పిల్ల, హెడ్డుగారికి వుప్పుదేశం సేస్తూంది. ముసలోజైనా యోగిని : (మునసబు చెవి దగ్గర నోరు పెట్టి చెవిగిల్లును) మునస: పిల్లా! సాల్రోజులైంది మునిసిబు నాయుడికి యీపాటి వుప్పుదేశం తగిలి-(హెడ్డు కనిష్టీబు రామప్పంతులు దగ్గరకు వెళ్లి యడంగా యిద్దరూ మాటలాడుదురు. ) హెడ్డు : కొత్తవారు యవరూ లేరే? బావాజీ గారు వుంటే మీకు భయ వేఁవింటి? రామ : కొత్త, పాతా, ఆలోచించుకోలేదు. కొంప ములిగింది. మీ సాయం కావాలి. హెడ్డు : డబ్బేవైఁనా పేల్తుందా? రామ : మీ చాతైతే, పేల్తుంది. హెడ్డు : యేమిటొచ్చిందో చెప్పు. రామ : లుబ్ధావుధాన్లు పెళ్లాడిన గుంట మధురవాణి తాలూకు కంటే తీసుకుని యెక్కడికో పారిపోయింది. హెడ్డు : యెందుకు పారిపోయిందో? గురుజాడలు 348 కన్యాశుల్కము - మలికూర్పు