పుట:Gurujadalu.pdf/390

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

పట్టుకునేటప్పటికి పర్వాలేదు నిలవమని చెప్పి, మేము ఒక పుణిక మంత్రించి, గంగ భరాయించిన కొద్దీ ఆ గంగ సారా అయిపోయింది. ఆ బ్రాహ్మడు సహస్ర పుణికలు తాగి జిజ్జున తేన్చాడు. బ్రాహ్మల్లో కూడా మహాత్ములుంటారు. కనుక్కోగలిగిన జ్ఞానికి గంగానది అంతా సారాయి కాదా? మునస: రామందాసొహడు, గంగ బరాయించడానికి గురువు; ఒకదరావుకి పద్దరావుఁలు సేరుస్తాడు. (హవల్దారు అచ్చన్న ప్రవేశించును.) దుకా : గురూ వీరు హవల్దార్ అచ్చన్న గారు. మంచి గ్యాని. మునసబు గారికి మేనల్లుడు. హవల్దారు : రామ్! రామ్! బైరాగి : రామ్! రామ్! హవల్దారు : (యోగినితో) పిల్లా హుక్కాలావ్? (హెడ్ తో) భాయీ గుంటూరు శాస్తులు గారి పతాయేమైనా తెలిశిందా? హెడ్డు : లేదు భాయి. దుకా : రామప్పంతులంటాడు పెళ్లికూతురు రెండో పెళ్ళి పిల్ల - దాన్ని అమ్మి డబ్బు చెయ్యి చిక్కించుకుని - హెడ్డు : ఆ మాటలు మనకెందుకు భాయి? మునస : పోలిసోళ్లకీ అక్కర్లేక, బాపనోళ్ళకీ అక్కర్లేక, యెదవముండని బాపనాడు పెళ్లి చేసుకుంటే లోకం అంతా వూరుకోవడవేఁనా? హెడ్ : డబ్బు యిచ్చినవాడికీ, పెళ్లి ఆడినవాడికీ లేని చింత, మనకేల మావాఁ! కాక, “ఈ రోజుల్లో బ్రామ్మణ్యం యెక్కడుంది? యెక్కడ చూశినా పిల్లల్ని ముసలాళ్లకి అమ్ముకోడాలు - రంధ్రా గర్భాలే కదా? హవ : కలికాలం గదా భాయీ? యెంత చెడ్డా బ్రాహ్మలు మనకి పూజ్యులు. హెడ్డు : అన్నా, యవరంత వారు, వారు. జ్ఞానం, నీతీ ప్రధానం గాని, జాతీలో యేవుఁది? వేమన్న యేవఁన్నాడు? మునస: యెవఁన్నాడా? నీతికి పోలీసొణ్ణి, ఘానానికి సాతానోణ్ణి అడగమన్నాడు. హెడ్డు :

మావాఁ! వెక్కిరించండి గాని, నేను యెన్ని తాలూకాల్లో నౌఖరి చేశానో అన్ని

తాలూకాల్లోనూ రండా గర్భాలు యెన్నని చెప్పను? నన్నడిగితే వెధవలు పెళ్లి చేసుకోవఁ గురుజాడలు 345 కన్యాశుల్కము - మలికూర్పు