పుట:Gurujadalu.pdf/385

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

గవర : మీకలా తోస్తే నాకేం పోయింది? యీ మూత తీసేసి, నా మానాన్న నేను వెళ్లిపోతాను. లుబ్ధా : మూతెందుకు తీసెయ్యడం. నాకు కలిగినది తృణవోఁ కణవో యిస్తాను. ఆ మూత తియ్యకుండా ఆ సీసా అలా వుంచి వెళ్లండి. పూజారి : యేవీఁ అవధాన్లుగారి గడుస్తనం! నేపోగానే పాతిపెట్టడానికాయెత్తు? ఆ సీసా తగిన శాంతి చెయ్యందీ భూస్థాపితం చేశారంటే, నేను రౌరవాది నరకాలకి పోనా? యిప్పుడే బిరడా తీసేస్తాను. లుబై : తీయ్యకు, తీయ్యకు. రేపు ఆ శాంతేదో తగలేతు గాని. గవ : అష్టాగైతే, యీ రాత్రల్లా యీ సీసా దగ్గిర పెట్టుకు పెరట్లో పడుకుంటాను. మీరు వెళ్ళి నిర్భయంగా పడుకుని నిద్రపోండి. (నిష్క్రమించును.) రామ : మావార! ఓ మాట. ( రామప్పంతులూ, లుబ్ధావధాన్లూ పక్కకు వెళ్లి మాట్లాడుదురు. ) రామ : నా కంటే మాటేవిఁటి, మావాఁ? లుబ్ధి : మీ కంటె మీ యింట్లోనే వుంది. రామ : మీ పెళ్లాం మా యింటికి వెళ్లిందని మీరంటున్నారు గాని, అక్కడికి ఆ పిల్ల రాలేదు. కంటా తాలేదు. లుబ్ధి : అయితే యేవైఁందో! నాకేం తెలుసును? రామ : వొద్దు సుమండీ నా కంటే నాకిచ్చెయ్యండి - నేను మా కానివాణ్ణి. లుబై : కంటే, గింటే, నాకు తెలియదు. రామ : నీకు తెలియకపోతే మరెవరికి తెలుసును? గవరయ్య నీ పెళ్లాం దెయ్యవైందన్నాడు గదా? నువ్వూ నీ కూతురూ కలిసి దాన్ని చంపేశారు కాబోలు. లుబ్ధా : ఓరి! గాడిద కొడుకా (కట్టెతో కొట్టబోవును) రామ : నా కంటె అపహరించావు గదా? నీ పని పట్టిస్తాను వుండు. (నిష్క్రమించును) లుబ్ధా : (తనలో) కంటె యావైఁనట్టు చెప్మా? (పైకి) అమ్మీ! మీనా : యేం నాన్నా? లుబ్దా

కంటె యేంజేసిందే?

కన్యాశుల్కము - మలికూర్పు గురుజాడలు 340