పుట:Gurujadalu.pdf/382

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

3వ స్థలము : లుబ్ధావధాన్లు యింటి వాకలి లుబ్ధావధాన్లు - (పచారు చేస్తూ) కనపడకపోతే యేవైఁనట్టు? నూతులోగానీ పడిందా? పోలీసువాళ్ళు యిల్లు దోచేస్తారు. నూతులో పడలేదా? పడకపోతే యేవైఁనట్టు? -రావఁప్పంతులు యింటికి పోయుం టుంది. అంతే కావాలి యంత అందవైఁన పిల్లా! నాదిగాక దురదృష్టం! యంతట్లో వెన్నెల చీకటైందీ! రేపో యెల్లుండో యెదిగొచ్చే పిల్లగదా అని సంబరపడ్డాను. ఒహవేళ - అప్పుడే పెద్దమనిషైందేమో? -అందుకు సందేహవేఁలా? లాకుంటే యింత యేపైన పిల్ల పెద్ద పడుచుకాకుండా వుంటుందా? యిలాంటివి యెన్ని పెళ్లిళ్లు చేసుకుని యందరు మొగుళ్లని కడితేర్చిందో! ఓరి కుంకపీనుగా, నీ కళ్లు యేవైఁపోయినాయిరా? రజస్వలాముండని చూస్తూ, చూస్తూ, యలా పెళ్లాడావురా? మరి నీకు గతులు లేవు. రాజమహేంద్రవరంలో వెధవ ముండల్ని పెళ్ళాడినవాళ్ల సామాజికంలో చేరావురా? అయ్యో! అయ్యో! దీనికి మరి ప్రాయశ్చిత్తం యక్కడిది? ఒహవేళ చేయించుకుందావఁ ంటే, శంకరాచార్యులు పాదకటం పెట్టమ్మంటాడు. బ్రాహ్మలు యిల్లు తినేస్తారు. అంతకంటే పోలీసు వాళ్లు నయం. అల్లరి కాకుండా హెడ్డుచేతులో పాతిక రూపాయలు పెట్టి, రేపురాత్రి బయల్దేరి కాశీ పోయి, గంగలో ములిగానంటే అన్ని పాపాలూ పోతాయి. కాశీవాసవేఁ చేసుకుంటాను. భగవంతుడు బుద్ధిచ్చేటట్టు చేశాడు. లేకుంటే, ముసలి వెధవకి పెళ్లి చేసుకోవడపు పోయీ కాలవేఁవిc? అన్ని విధాలా యీ రామప్పంతులు నా కొంప తీశాడు. (రామప్పంతులు ప్రవేశించి.) రామ : యేవిఁటి మావాఁ రావఁప్పంతులంటున్నారూ? లుబై : యేవీఁ లేదూ. రామ : యింత రాత్రివేళ పచారు చేస్తున్నారేవిఁ? లుబ్ధి :

యేమీఁలేదు - నిద్దరపట్టక.

రామ : మావఁగారూ, ఆ కంటె యిప్పుడు తెమ్మని మధురవాణి భీష్మించుకు కూచుంది. శ్రమ అని ఆలోచించక యిప్పించాలి. లుబై : కంటేవిఁటి? రామ : మీ భార్యాకి పెట్టిన కంటండీ. లుబా : నా భార్యాకి నేను పెట్టలేదు. గురుజాడలు 337 కన్యాశుల్కము - మలికూర్పు