పుట:Gurujadalu.pdf/377

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

సిద్ధాం: దివ్వేలేదు, దీపం లేదు. ముక్కలైయ్యి. పోలి : గవరయ్యముక్కల మీద కన్నేసి సిల్లంగెట్టేస్తున్నాడు. నరశింవ్వ నీదివ్వె - (ముక్కలు యెత్తిచూసి) సీ! భష్టాకారి ముక్కలేశావు. సిద్ధాం: (పంపకం ముగించి తన ముక్కలు తీసి చూసుకొని) మృత్తికాచమే! పూజారి : పోలిశెట్టికి అంత అలకైతే, నే నింటికిపోయి పరుంటాను. (గవరయ్య నిష్క్రమించును. మధురవాణి వెంట వెళ్లి తిరిగివచ్చును.) పోలి : శని విరగడైపోయిందిరా, దేవుఁడా! - ఒట్టి భష్టాకారి ముక్కలు. ఒహటీ. మధు : ఒకటి. భుక్త

ఒహటి.

సిద్ధాం : ఒహటి. పోలి : రెండు. మధు : రెండు. భుక్త : రెండు. (సిద్ధాంతి ఆలోచించును.) పోలి : యెందుకాయెజ్జాలోశన? నా మాటిను. మూడో బేసెట్టకు. (వీధి తలుపు తట్టబడును) మధు : పంతులు! పోలి : యీవాళ రాడని సెప్పితివే? మధు : రారనుకున్నాను వొచ్చారు. యేంచేదాం? సిద్ధాం : ఆట తీసెయ్యండి. (ముక్కలు పడవేయును) పోలి : బే)గెయడానికా? నేనొప్పను, మధురోణి, ఆటాడి మరీ తలుపుతియ్యి. మధు : ముక్కలు కిందబెట్టి, లేచి (సన్నని గొంతుకతో) గోడ గెంతి పారిపోండి. భుక్త : దిడ్డితో వంట వెళ్లిపోతాం. పోలి : నేను పట్టనే? యేటి సాధనం? భుక్త : మేం దిడ్డితో వంట పోతాం. నువ్వు అటకెక్కు పోలి : నన్నెక్కించి మరీ యెళ్లండి. కాలుజారితే యేటి సాధనం? గురుజాడలు కన్యాశుల్కము - మలికూర్పు 332