పుట:Gurujadalu.pdf/33

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఒక కొత్త సామాజిక బాధ్యత సూచించగలిగాడు. సమాజంలో వస్తున్న ధోరణులకు ఒక కాపలాకుక్కలా వ్యవహరించి, ఏ పెడధోరణి కనిపించినా, తన స్వంత వివేచనతో పసిగట్టి అరచి, గోలచేసి, తలపడి జనాన్ని జాగృతం చేయటం దాని బాధ్యత. - ఇది సమాజ సంబంధమైనదైతే -

సాహిత్యంలో ఆయన నిలువు - కొత్తపాతల మేలుకలయిక, క్రొమ్మెరుంగుల జిమ్మగా - అంటూ వ్యక్తం అయింది. కొత్తపాతల మేలు ఎవరు నిర్ణయిస్తారు? కొత్తలోని మేలునీ, పాతలోని మేలునీ తూచేది ఎవరు? ఎలా? స్వంత వివేచన.

ఈ స్వంత వివేచన అన్నది వ్యక్తి ఇచ్ఛమేరకు ప్రవర్తించే లక్షణంగా పొరబడరాదు. సమాజ నియమాలను, ధోరణులను వివేచించి తన బుద్ధి మేరకు తనను తాను నడుపు కునే శక్తి అది. అలాగే అది సాహిత్యంలో స్వీయమానసిక ధోరణిగా కూడా పొరబడరాదు. అది సాహిత్యంలో వ్యక్తియొక్క సామాజిక ప్రతిఫలనమేనని గ్రహించాలి. అది సమాజంపై వ్యక్తిలో నిబిడీకృతమైన బాధ్యతగా అర్థం చేసుకోవాలి.

4

గురజాడ మీద ప్రశంస, అభిశంసనల చరిత్ర అంతా ఆయన నిలువు పట్ల సమర్థన, వ్యతిరిక్తతల చరిత్రే. ఒక విధంగా ఇది దాదాపు వందేళ్ల తెలుగు జాతి బౌద్దిక, తాత్విక చరిత్రగా కూడా భావించవచ్చు. ఈ చరిత్రను కొన్ని దశలుగా విభజించి క్లుప్తంగా పరిశీలించ వచ్చు. ఆరంభదశలోని సమర్ధన, వ్యతిరిక్తతలు తరవాత కాలాలలో అదే విధంగా లేవు. అవి స్వభావంలోనూ, స్వరూపంలోనూ మారుతూ వచ్చాయి.

గురజాడ నిలువుపై ఆరంభ సమర్థన, వ్యతిరిక్తతలు ఏమిటి? ఎందుకు?

వారి తొలి సమర్థకులు అనేక రకాలు. సామాజిక నిలువుతోనూ, సాహిత్య నిలువు తోనూ పూర్తి ఏకీభావం కలవారు కొందరు. ఆయన సాహితీ సామర్థ్యానికి ముగ్ధులై పోయినవారు ఇంకొందరు. తమ చుట్టూ మసిలే మనుష్యులలో కనిపించే అవతత్వాలను పోల్చుకోటానికి కావలసిన జీవిత పరిశీలనను అద్భుతంగా అక్షరబద్ధం చేసిన సామర్థ్యానికి తాదాత్మ్యం చెందినవారు మరికొందరు.

వ్యతిరేకులలో గురజాడ సామాజిక నిలువుతో అంటే సంస్కరణల సమర్ధనతో ఏకీభవించనివారు కొందరైతే సాహిత్య నిలువుతో అంటే వాడుక భాషతో విభేదించనివారు