పుట:Gurujadalu.pdf/271

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

మధు : ఆఖరు వికారం. గిరీ : (ఆత్మగతం) నేను వుడాయిస్తానని దీనికెలా తెలిసింది చెప్మా! సానివాళ్లకి కర్న పిశాచి వుంటుంది కాబోలు (పైకి) మైలబడితే స్తానం చేసి వేగిరం రా. మధు : యిప్పుడేం తొందర, తలంటుకుంటాను. రామ : (ఆత్మగతం) చబాష్, యేమి నీతయిన మనిషి యిది! వెధవని ముట్టుకోనివ్వ కుండా యెత్తు యెత్తింది! గిరీ : మైలా గియిలా మా యింగ్లీషు వారికి లక్ష్యం లేదు, యిలారా (దగ్గిరికి చేరును.) మధు : (వేలుచూపి) అక్కడనే ఆగండి. మీరు కిరస్తానం అయితే కావచ్చును. నేను కిరస్తానం ఇంకా కాలేదే. మీరు కిరస్తాం అన్నమాట యిప్పుడే ఒహరు చప్పగా విన్నాను. రామ : (తనలో) నె చెప్పానంటుందా యేమిటి! గిరీ

ఒకరు చప్పగా విన్నావూ? యవరా జెప్పింది? యవడికిక్కడికి రావడానికి మగుదూర్

వుంది? యిలాంటి చాడీకోర్ కబుర్లు చెప్పడానికి యవడికి గుండ వుంది? ఆ మాటలు విని నాతో చెప్పడానికి నీకెక్కడ గుండుంది? చెప్పు! రామ : (తనలో) తంతాడు కాబోలు, యరక్క చిక్కడ్డాను. మధు : మొగాడే చెప్పాలాయేవిఁటి? ఆడవాళ్లకి దేవుఁడు నోరివ్వలేదా? గిరీ : (తనలో) పూటకూళ్ల ముండే చెప్పింది కాబోలు (పైకి) ఆడదా? ఆడదాన్ని నోరు బెట్టుకు బతకమనే దేవుఁడు చేశాడు. పరువయిన ఆడది నీ యింటి కెందుకొస్తుంది. మధు : పరువైన మొగాణాచ్చినప్పుడు పరువైన ఆడవాళ్లేందుకు రాకూడదు? ముందు కూచోండి. తరవాత కోప్పడుదురు గాని, చుట్ట తీసుకొండి. అదుగో అగ్గిపెట్ట. గిరీ ముట్టుకోడానికి వల్ల లేకపోతే అగ్గిపుల్ల వెలిగించి యివ్వడానికయినా పెట్టిపుట్టాను కానా? యీవాళ మహా ఉత్సాహంగా వచ్చాను గాని, ఉత్సాహ భంగం చేశావ్. మధు : యెవిఁటా వుత్సాహం?

యిదిగో జేబులో హైదరాబాద్ నైజామ్ వారి దగ్గర్నించి వచ్చిన ఫర్మానా. మా నాస్తం

నవాబ్ సదరదాలత్ బావురల్లీ ఖాన్ ఇస్పహన్ జంగ్ బహద్దర్ వారు సిపార్స్ చేసి వెయ్యి సిక్కారూపాయలు జీతంతో ముసాయిబ్ ఉద్యోగం నాకు చెప్పించారు. అనగా హమేషా బాదా వారి హుజూర్న వుండడం. రామ : (తనలో) యెవిఁట్రా వీడి గోతాలు!

గురుజాడలు 226 కన్యాశుల్కము - మలికూర్పు