పుట:Gurujadalu.pdf/153

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

                                     7
She మగవారి బాటలు మరి మరి వింత
      మగనాలిపైగాని మరులు కోరెంత.
                                     8
He మాటలు కావిదె మనసిత్తు జూర
She మనసొక్క టేయైతె మరి రాకుపోర.
                                     9
He చెంతకు చేరిన చెనకుట మేలె?
      వంతలబెట్టకు వనజాక్షి యేలె.
                                     10
She నీ కాంత నేనైన నెనరుంతువేమో!
      పరకాంత పొందంటె XXXX
                                      11
He నాకాంత వీవైతె నా భాగ్యమెంత?
She నీకాంత నయ్యెద నిదె చూడు వింత.


(గురజాడ రామదాసు పంతులు ఈ గేయాన్ని, విజయనగరం నుంచి 1940 ప్రాంతంలో వెలువడిన 'విజయ' అనే పత్రికలో ప్రచురించారు. ఈ గేయాన్ని సేకరించిన బంగోరె దక్షిణ ఢిల్లి ఆంధ్రసంఘం వెలువరించిన గురజాడ సంస్మరణ విశేషసంచికలో ప్రచురించారు. సం!!)

గురజాడలు

108

కవితలు