పుట:Goopa danpatulu.pdf/47

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు
40

గోపదంపతులు.

సామికి గొరిత్తలేవియు గన్పట్టలేదు. అవియెల్ల నింతకు ముందు తానువిశాఘపురిలో సాధనమొనర్చినవే. కంపెనీవారు విదేశములోని బలశాలులొనరించు వింత వింతచర్యలు దెల్పు పటములందెప్పించి యప్పలసామికి జూపనతడు వాని నెల్ల సులువుగా సాధనములోనికి దెచ్చుకొనుచుండెను.

   సర్కసుయజమానులు తలంచినరీతిగా నప్పలసామి తమకు సర్వవిధముల ననుకూలు డయ్యెను. అప్పలసామి యాయాక్రీడలయందు నానాట గొతూహల మతిశయింప దన పూర్వవృత్తినెల్ల విస్మరించి యీనూత్నజీవనమునకే యలవాటు పడెను
  ఒకనాడు రామస్వామిముదలియారు మనకధా నాయకుని బసకేగి యిట్లుసంభాషించెను.  
    రామ--అయ్యా! మిమ్ముగుఱించి మేము తలంచిన తలపులన్నియు నిక్కునములయ్యెను. త్రుప్పుపట్టియున్న మీయద్వితీయశక్తుల వాడి లోకు లెఱుగుకాలము నేటికి జేకూరెను. మిమ్ముదెచ్చు మొన్నందులకు మేమును, మాతొ వచ్చినందుకు మీరును సర్వవిధముల దృప్తిపొందుచున్నామనియే మాతలంపు. ఏమందురు?
  అప్ప--నిజమే. మొదట గొన్నాళ్ళీ నూతన జీవన మించుక భారముగా దోచినను నానాట నాకిందానందము పొందుపడుచున్నది. నాభార్య పట్టణవిశేములందిలికించుటతో