పుట:Gona gannareddy, Adavi Bapiraju.pdf/115

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

108

గోన గన్నా రెడ్డి

కుప్పసానమ్మ: మా తమ్ములను గజదొంగలంటూఉంటే నాకు హృదయకంటకంగా ఉంటుంది.

అన్నాంబిక: మహారాణీ! నాకు శ్రీగన్నారెడ్డి దొంగ అనే భావం ఎప్పుడూ కలగలేదు.

కుప్పసానమ్మ: అయితే చక్రవర్తిని దుర్భాషలాడి అత డెందుకు ఓరుగల్లు విడిచిపోవాలి రాజకుమారీ?

అన్నాంబిక: అలా అని ఏ ఏ రాజ్యాలు వారు దోచుకున్నారో మీరు తార్కాణించగలరా మహారాణీ?

చినదామానాయుడు ఈ మందిరంలో దూరంగా నీడలు దట్టంగా ఆవరించి ఉన్నచోట కూర్చుండిఉన్న దివ్యసుందరియైన ఈబాలిక ఎవరు? ఈమెకు గన్నారెడ్డిప్రభువంటే అంతనమ్మక మేమిటో? అన్నాంబికాదేవి క్షేమంకూడా విచారించి రా దామానాయుడూ!’ అనికదా గన్నయ్యప్రభువు తన కాజ్ఞ ఇచ్చింది. ‘రాకుమారీ’ అని మహారాణి సంబోధిస్తున్నది. అవ్యక్తమైన దివ్యరూపంతో ఠీవిగా, పవిత్రభంగిమలో అధివసించిఉన్న ఈబాలిక తమ నాయకుని జీవితనాటకంలో ముఖ్యపాత్ర వహించబోతున్నదని మనసులో అనుకొన్నాడు.

కుప్పసానమ్మ! దామానాయకప్రభూ! ఆతర్వాత ఏమయింది?

దామా: మూడుదినాలు తన సైన్యానికి కోటపై తలపడే ఒక నూతన విధానం బోధించారు మా నాయకులు. ఈలోగా అంచెలమీద మారెండవ సైన్యంతో ఒక రహస్యప్రదేశంలో ఉన్న విఠలధరణీశునికి సైన్యం యావత్తూ నడుపుకొని రావలసిందని వేగు పంపించారు. ముందుగా తమ తమ్ములను మేఘాలమీద వచ్చి తన్ను కలుసుకోవలసిందనిన్నీ వార్తపంపారు.

“ప్రసిద్ధిచెందిన మొసలివేటకాళ్ళు మొసళ్ళవలెనే రాత్రిళ్ళు నీళ్ళలోకి జారి మొసళ్ళను వేటాడి చిత్రవధచేశారు. ఆవేటలో ఆరుగురి ప్రాణాలు పోయాయి.”

అన్నాంబిక ‘అమ్మా!’ అని చేతులతో కళ్ళుమూసుకొని గజగజ వణికి పోయింది. కుప్పసానమ్మ లేచి ఆమెదగ్గరకుపోయి మీద చేయివైచి ‘రాకుమారీ! యుద్ధాలలో ఈలాటి ఘట్టాలు అనేకం వస్తాయి. అది దురదృష్టం. రాజ్యాలు పరిపాలించేవారికి ఈలాంటివార్తలు వినడం తప్పదు’ అని అనునయించింది.

చినదామా: మహారాణీ! ఆ కందకంలో మొసళ్ళన్నీ నాశనం అయ్యాయి. మా సైన్యం అంతా సిద్ధంఅయింది. ఒకరాత్రి ఉద్దండమైన కేకలతో ముట్టడి ప్రారంభం అయింది. కోటమీదనుండి బాణాలు అగ్ని వర్షం మామీద వర్షిస్తున్నవి. కాని మా తలమీద అభేద్యమైన ఉక్కు ఫలకవితానం ఏర్పడింది. ఎడ్లులేని రెండెడ్లబళ్ళక్రిందనుండి మావాళ్ళు అగ్ని