పుట:Gona gannareddy, Adavi Bapiraju.pdf/110

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఓరుంగల్లు

103

అప్పుడు శివదేవయ్యదేశికులు ఈ ఆంధ్ర మహాసామ్రాజ్యంలోని సర్వ సామంతులకూ, బ్రాహ్మణోత్తములకు, సర్వప్రజలకు శ్రీ శ్రీ శ్రీ సార్వభౌములు తమ శ్రీముఖము ఈరీతిగా వినిపిస్తున్నారు. “శ్రీస్వయంభూదేవ దివ్యశ్రీ పాదారవిందాలను పూజించి శ్రీ శివప్రసాదలబ్ధమైన ఈ సామ్రాజ్యము యావత్తూ తమస్థానాన ప్రతినిధిగా తమ పెద్దకుమార్తెలైన శ్రీ శ్రీ శ్రీ రుద్రదేవమాహారాజులం వారు పరిపాలిస్తారు. శ్రీ సార్వభౌములవారు తమ యావత్తుకాలమూ తపస్సుచేసుకోడానికి నిశ్చయించినారు. ఇది సార్వభౌముని పవిత్రేచ్ఛ. ఈ ఇచ్ఛను ధిక్కరించిన వారు భగవద్రోహులు, రాజద్రోహులు, ధర్మద్రోహులు” అని గంభీరంగా ప్రకటించారు. వెంటనే మిన్నుముట్టే జయజయధ్వానులు విరోధిరాజుల గుండె లవియ చేస్తూ సర్వ విశ్వమూ క్రమ్మినవి. విప్రాశీర్వాదాలు చెలగినవి. మహామంత్రి, మహా సైన్యాధ్యక్షులు, మహాసేనాపతులు, మహామండలేశ్వరులు, మండలేశ్వరులు, ప్రధానులు, రాజోద్యోగులు రాజప్రతినిధి శ్రీ కుమార రుద్రదేవ మహారాజులం వారికి మహారాజప్రాభృతా లర్పించుట మొదలుపెట్టినారు.

ఆ సభ రెండవయామం పూర్తి కాకమునుపే ముగిసినది. వందిమాగధులు కై వారాలుపేయ శ్రీ శ్రీ గణపతిరుద్రప్రభువు తననివాసం చేరినారు. తర్వాత రుద్రప్రభువులవారు తమ నగరికి విజయం చేసినారు.

6

కాకతీయసార్వభౌమ పరిపాలితమైన దేశాలన్నీ వీరశైవభక్తితో నిండి వున్నాయి. గురుమల్లికార్జున పండితారాధ్యులు ఋగ్వేద నియోగి బ్రాహ్మణ వంశంలో వుద్భవించారు. వారి తండ్రి భీమన, చాళుక్య భీమేశ్వర నగరంలో భీమేశ్వరస్వామివారి అర్చకుడై వుండేవారు. తల్లి గౌరాంబ. మల్లికార్జునారాధ్యుడు సర్వవిద్యాపారంగతుడు. ఆయన కోటిపలి సోమారామక్షేత్రవాసి అయిన ఆరాధ్య దేవర అనే గురువుకడ వీరశైవదీక్ష పొంది దృఢవ్రతుడగు వీరశైవాచార్యుడై నాడు.

శైవమత రహస్యాలన్నీ సమన్వయించి, వానిని శివతత్వసార మనే గ్రంథంగా రచించా డీ మల్లికార్జునుడు. దేశమంతటా వీరశైవమత ప్రచార మొనర్చెను.

ఆనాటికి బౌద్ధమత ప్రాబల్యం నశించిపోలేదు. వైష్ణవమతమూ పూర్తిగా వున్నది. జినమతము నశించిపోలేదు. మల్లికార్జునారాధ్యుని శిష్యుడైన పాలకురికి సోమనాథకవి ఆ పండితుని చరిత్రమూ, వారి శివతత్వసారమూ జానుతెనుగులో, అద్భుతమైన శైలిలో పండితారాధ్యచరిత్రము రచించెను. బసవపురాణమూ, ఈ గ్రంథమూ ద్విపదకావ్యాలుగా రచించినాడు. అనుభవసారము, చతుర్వేద సారసూక్తులు, సోమనాథభాష్యం, రుద్రభాష్యం, బసవరగడ, గంగోత్పత్తిరగడ,