ఈ పుట అచ్చుదిద్దబడ్డది
మాలమాదిగలమొఱ
గాంధీమహాత్మ, గాంధీమహాత్మ,
కాచి రచ్చించు గాంధీమహాత్మ||
నరకారువోరు, కరుకైనవోరు,
ఉప్పేరితేను తప్పేశినోరు ||గాంధి||
డబ్బుగలోరు, దరికి రానీరు,
ఈగోర మేమి మానేర మేమి? ||గాంధి||
మాలమాదిగలం, మనసులం గామా ?
కుక్కలకన్నా తక్కువయ్యామా ||గాంది||
మామొఱాలించ, సామోరె దిక్కు,
ఆసామివోరి, అవుతారమైన
గాంధీమహాత్మ గాంధీమహాత్మ
కాచి రచ్చించు గాంధీమహాత్మ.
స్వరాజ్యలక్ష్మిపెండ్లి
పోదాము స్వరాజ్యలక్ష్మిపెండ్లి జూడ
రారవె రమణులారా! ||