పుట:Geethamulu, basavaraju apparao (1934).pdf/197

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

                వసంతాగమము

గున్నమావి తోటలోన
గువ్వ యెకటి గూడు కత్టి
సరసుడౌ వసంతురాక
కొఱకు తమిని వేచియుండె.

కాని నాయనమ్మ ముగుల
కలచుచు హృదయమ్ములోన
మరగువలపు తలపు నెవ్వ
రెఱిగింతురు నీకు కృష్ణ!

పగ లెల్లను ధాత్రీరమ
పచ్చనిపుట్టమ్ము గట్టి
పసుపుపూల చాల్చి బాల
పవను గూడి తిరుగుచుండ

చల్లనైన చెట్టునీడ
నుల్ల మలర గూరుచుండి
వనము కవల బారుసోన
పాటలు వినుచుందు కృష్ణ!