ఈ పుట ఆమోదించబడ్డది
పాపఫలము నెత్తణచగ
బతుకు తెరువు వేరులేక
దాసుడనై దాంపత్యపు
తళుకు లొలక చిట్టితొ స
య్యాటలాడు తుండగ నా ఆయువు ముగిసేనా ?
ఆయువుముగిసే అదునుకు ఆటలలో ఎగసేనా ?
కత్తిపోట్లు తిని తిని కడు
గాయమైన పేదగుండె
బీతువోవ పరవశాన
ప్రియమారగ నాచిట్టిని
కౌగిలించుకుండగ నాకాయము సురిగేనా ?
కాయము సురిగేవేళకు కౌగిలిలో కరిగేనా ?
క్రాస్ పరీక్ష
ఈవు కనుబొమ లిటె చిట్లించగానె
తనువు కంపిల్లి గుండెలు తల్లడిల్లి
"వాకుధోరణి" గల న్యాయవాది నయ్యు
మొదటిమాటలోనే తెల్లమొగము వేతు