పుట:Geethamulu, basavaraju apparao (1934).pdf/166

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

రమ్య మైయెప్పు సింహాచ్లముపై న
భక్తవరదు సింహాద్రియప్పని భజించి
యచటి ప్రకృతివిచిత్రమ్ములరసి చనుమ!

పావనక్షేత్రముల కెల్ల పావనమ్ము
మీరి దక్షిణకాశియన్ పేర బరగు
పాదగయతీర్ధమున గ్రుంకి భక్తితోడ
దగ్ధశవహవ్యధూపసంతర్పణమ్ము
కుక్కుటేశరునకు జేసి మ్రొక్కి చనుమ !
పరమసాధ్వి పతివ్రత భర్తతోడ
సాగుమానముజేసిన సచ్చరిత్రి,
కాపుకోడలు కామమ్మ, కలియుగాన
బొందితోడ కైలాసము నందినట్తి
పుణ్యభూమి దర్శింపక పోకు మోయి,
కులము తీరెంచ నేటికి గుణము కల్గ !
కులుకులాడి, మాయావిని, క్రూరమదన
బాణహత, మారుతల్లి,తన్వలసి విఫల
యై నిజేశునితో కల్ల లాది, తనదు
కాలుసేతులు నరికింప,నేల గూలి
నట్టి సారంగధరుమిట్టయదియె ! అచట
చల్లగా వీచుమా, నీదు జాలితెలియ !