పుట:Geetham Geetha Total.pdf/94

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

36. ఆ. మనసు నిలుపలేని మనుజున కీయోగ
పథము నొంద దుర్లభంబు గాన,
వశ్యమానసం బవశ్యంబుగా, నుపా
య మగు కర్మయోగమందె కల్గు.

అర్జునుడిట్లనెయె :-

37. ఆ. శ్రద్ధ గలిగియుండి సంపూర్ణయతనుండు
గానియట్టి చలిత మానసునకు
యోగసిద్దిఁ జెంద కుండుటయే కాక
యేమిగతులు పుట్టు నింది రేశ!

38. తే. ఆత్మదర్శన మార్గమందప్రతిష్ఠుఁ
డైనమూఢునిగతి యేమి యంబుజాక్ష !
ఛిన్న మేఘంబు రెంటికిఁ జెడినరీతి
నుభయవిభ్రష్టుఁ డతఁడు గాకుండునొక్కొ.

39. తే. సరసిజాక్ష ! నా కున్నయీ సంశయంబు
ఛేద మొనరింపవలయు సశేషముగను;
ఇట్టు లొనరింప నీకంటె నితరుఁడొకడు
కలుగఁ గలఁ డొక్క జగతిలోఁ గమలనయనఁ

శ్రీ భగవంతుడిట్లనియె :-

40. ఆ. ఇహమునందు నాశమెన్నండుఁ గనఁడట్టి
వాఁడు చెడుపు గనఁడు పరమునందుÑ
సకలశుభము లొసఁగు సత్కార్య మొనరింప,
నశుభములు తటస్థమగుట గలదె?