పుట:Geetham Geetha Total.pdf/84

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

06. ఆ. ఎవఁడు మనసు నిగ్రహింపఁగల్గునొ వాని
యాత్మ కదియ మిత్రమగుచుఁ జెలఁగు;
అటులు మనసు నిగ్రహము సేయఁ జాలని
యతనియాత్మ కదియయగు విరోధి.

07. తే. జగతి శీతోష్ణ సుఖదుఃఖ జాలమందు
మఱియు మానంబునం దవమానమందు
మనసునం దెప్డుఁ జలనంబు గనని శాంతి
యుతున కగు నాత్మదర్శనం బతుల చరిత!

08. తే. జ్ఞాన విజ్ఞానతృప్తుండు కర్మయోగి
యాత్మయందునె నెలకొన్న యట్టి ఘనుఁడు,
యోగయుక్తుండు, విజితేంద్రియుండు మఱియు
మృత్తికాశ్మకాంచన సమచిత్తయుతుఁడు.

09. ఆ. సరసులందు మిత్రజనులం దుదాసీను
లందు సములయందు నహితులందు
బంధువులను సాధులందుఁ బాపులయందు
సమత నుండువాఁడె సత్తముండు.

10. ఆ. యోగి యుంచు మనసు యోగంబుననె నిరం
తరము చిత్త మాత్మ నిరతి సల్ప;
ఆశలెల్ల విడచి యపరిగ్రహుండు నే
కాకి jైు రహస్యగతి వసించు.

11. ఆ. తగ్గుగాక యున్నతముగాక శుభ్రమై
నట్టిచోట సుస్థిరాసనమున
దర్భపఱుపు పేర్చి దానివై వస్త్రకృ
ష్ణాజినములఁ జెలఁగు నటు లొనర్చి.