పుట:Geetha parichayam Total Book.pdf/55

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

పెట్టుకొన్నారు. అటువంటి చోట కూడ గీతాశ్రవణమని వినేదానికి పోవుచున్నారు తప్ప, అందులో సారాంశమేమని గ్రహించడానికి పోవడము లేదు.

ఇటువంటి కాలములో కూడ గీత అంటే ఏమిటి? గీతా సారాంశము ఏమిటని యోచించు వారు కూడ అక్కడక్కడ గలరు. అటువంటి వారికి ఇంతవరకున్న గీత భావములలో ఎన్నో లోపములు కనిపించగ వాటి నిజస్వరూపమేమిటని అన్వేషిస్తున్నారు. అలా గీత నిజస్వరూపమేమిటో తెలుసుకోవాలను తపనకల్గిన వారున్నారని, వారి కోసమే ఈ గీత బయల్పడు చున్నదని, అటువంటి వారికి ఎన్నో తెలియని రహస్యములను తెలియజేస్తు త్రైత సిద్ధాంత భగవద్గీత ముందుకు సాగిపోగలదని భావిస్తున్నాము.

మానవ శరీరములో పేరుగాంచిన గుణములు కామ, క్రోధ, లోభ, మోహ, మద, మత్సరములనునవి ఉన్నవి. కామమనగ ఆశ, క్రోధమనగ కోపము, లోభమనగ పిసినారి తనము, మోహమనగ నాది నావారను భావము, మదమనగ గర్వము, మత్సరమనగ అసూయ అని చెప్పుకోవచ్చును. అలాంటి గుణముల చేత సర్వమానవులు కదిలింపబడి పనులు చేయుచుందురు. భూమి మీద ఏ జీవరాసియైనప్పటికి గుణముల వలననే కదలి కార్యములు చేయుచున్నవి. ఈ పద్ధతి ప్రకారము అర్జునుడు యుద్ధము చేయననుకొనుటకు కారణమైన గుణము మోహగుణము. మొదట ఆశ, కోపము యుద్ధమునకు ప్రేరేపింపగ తర్వాత మోహగుణము వలన వీరు నావారు వీరినెట్లు చంపగలనను కొన్నాడు. ఈ విధముగ గుణముల మధ్య అశాంతి ప్రతి జీవునికి ఏర్పడుచున్నది. అర్జునునకేర్పడిన మోహగుణమును, బుద్ధి యోచించి వీరిని చంపుట వలన పాపమొచ్చునని సంకల్పము పుట్టించగ అదే అదునని శ్రీకృష్ణుడు గీతను చెప్పాడు. అర్జునునికేర్పడినట్లు గుణముల మధ్య మానవునికి అశాంతి ఏర్పడి పాపమను భావమొచ్చినప్పటికి శ్రీకృష్ణునిలాగ వెంటనే చెప్పు గురువులేనందున మానవుడు వివరము తెలియక అశాంతిలోనే మునిగిపోవుచున్నాడు. అర్జునునికి